Satyabhama lengthy schedule completed in a single stretch: పెళ్లి తరువాత ఇంటికే పరిమితం అవుతుంది అనుకుంటే కాజల్ మాత్రం వరుస సినిమాలతో అదరగొడుతోంది. ఇప్పటికే భగవంత్ కేసరి లాంటి హిట్ అందుకున్న ఆమె ఇప్పుడు రోల్ లో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా “సత్యభామ”. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. “సత్యభామ” సినిమాను అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. గత నవంబర్, డిసెంబర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంది ఈ సినిమా. ఈ క్రమంలోనే “సత్యభామ” సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. 35 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ 90 శాతం పూర్తయిందని సినిమా యూనిట్ ప్రకటించింది.
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ మానసిక స్థితి బాలేదు.. లియో బ్యాన్ చేయండి!
ఈ షెడ్యూల్ లో కాజల్ అగర్వాల్ హ్యూజ్ యాక్షన్ సీన్స్ చేసిందని, ఫైట్ మాస్టర్ సుబ్బు ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించారని మేకర్స్ తెలిపారు. ఇక కాజల్ గతంలో ఎప్పుడూ కనిపించని యాక్షన్ మోడ్ లో “సత్యభామ”లో కనిపించబోతోందని, ఆమె ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో శ్రమించి ఈ యాక్షన్ సీక్వెన్సులు కంప్లీట్ చేసిందని చెబుతున్నారు. ఈ సినిమాలో ఈ పోరాట ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని టీమ్ బలంగా నమ్ముతోంది. “సత్యభామ” బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. కాజల్ అగర్వాల్ తో పాటు ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ జి విష్ణు, సంగీతం శ్రీ చరణ్ పాకాల అందిస్తున్నారు.