Games Of Thrones Actor Died: సినీ పరిశ్రమలో ఒక తీవ్ర విషాదం నెలకొంది. ‘గేమ్స్ ఆఫ్ థ్రోన్స్’ నటుడు డారెన్ కెంట్ కేవలం 36 ఏళ్ల వయసులో కన్నుమూసిన అంశం షాకింగ్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు కెంట్ చాలా కాలంగా అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడని, సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో పోరాడిన డారెన్ కెంట్ ఎట్టకేలకు ప్రపంచానికి వీడ్కోలు పలికాడని తెలుస్తోంది. డారెన్ కెంట్ మరణ వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో సోషల్ మీడియాలో డారెన్ కెంట్ కి నివాళులు అర్పిస్తున్నారు. డారెన్ కెంట్ ఆగస్టు 11న మరణించాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని మంగళవారం ఓ ట్వీట్‌లో టాలెంట్ ఏజెన్సీ ధృవీకరించింది.
Uma Shanti: జాతీయ జెండాను అవమానించిన సింగర్… కేసు నమోదు!
‘మా ప్రియమైన స్నేహితుడు, క్లయింట్ డారెన్ కెంట్ శుక్రవారం మరణించారని మేము మీకు తెలియజేయడానికి చాలా బాధగా ఉంది, ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి అండగా ఉన్నాం, శాంతితో విశ్రాంతి తీసుకోండి మిత్రమా’ అని రాసుకొచ్చింది. ఇక అందుతున్న సమాచారం మేరకు డారెన్ కెంట్ చాలా కాలంగా ఎముకల వ్యాధి, ఆర్థరైటిస్, చర్మ రుగ్మతలతో బాధపడుతున్నాడు. అతనికి వచ్చిన ఈ చర్మవ్యాధి చాలా అరుదు అని అంటున్నారు. డారెన్ తన కెరీర్‌ను 2008 సంవత్సరంలో మిర్రర్స్ అనే భయానక సినిమాతో మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఈ ఎమ్మీ అవార్డు గ్రహీత ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో కూడా నటించారు. ఇక చివరిగా ఆయన 2023 చిత్రం ‘డూంజియన్ అండ్ డ్రాగన్స్ హానర్ అమాంగ్ థీవ్స్’లో కనిపించాడు. డారెన్ కెంట్, అనేక సినిమాల్లో తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు, మరోపక్క రచయిత, దర్శకుడుగా కూడా తన లక్ పరీక్షించుకున్నాడు. ఇక 2021 సంవత్సరంలో ‘యు నో మీ’ అనే షార్ట్ ఫిల్మ్‌కి ఆయన దర్శకత్వం వహించాడు.