GAMA Tollywood Awards 2024 to be held at Dubai: దుబాయ్ లో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే గామా అవార్డ్స్ 2024 మార్చి 3న మరింత భారీగా నిర్వహించబోతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా “గామా నేషనల్ ఐకాన్ అవార్డ్” అందించాలని భావిస్తున్నట్టు అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు వెల్లడించారు. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించడంతో పాటు 57 ఏళ్ల నేషనల్ అవార్డ్ చరిత్రలో జాతీయ స్థాయిలో మొట్టమొదటి సారి, ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ “అల్లు అర్జున్”కి, వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ గామా వేదిక పై ప్రత్యేక సత్కారం చేయాలని, భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గామా అవార్డ్స్ కార్యక్రమానికి తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. 2021, 2022, 2023 సంవత్సరంలో ఉత్తమ చిత్రాలు, నటులు, దర్శకులు, సంగీతం విభాగాలలో ప్రతిష్టాత్మకమైన గామా అవార్డ్స్ అందజేయనున్నట్టు గామా అవార్డ్స్ CEO సౌరభ్ కేసరి తెలిపారు. ఇక ఈ వేడుక ఈటీవీలో ప్రసారం చేయనున్నట్టు వెల్లడించారు.
Bigg Boss 7 Arrests: షాకింగ్ న్యూస్.. బిగ్ బాస్ అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్ డ్రైవర్లు అరెస్ట్!
ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకులు సుకుమార్(పుష్ప), బాబీ(వాల్తేరు వీరయ్య), బుచ్చిబాబు సనా(ఉప్పెన), మెగా బ్రదర్ నాగబాబు, ప్రముఖ దర్శకుడు వీ.ఎన్.ఆదిత్య , నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, వైజయంతి మూవీస్ స్వప్న దత్, ప్రియాంక దత్, శ్రీ DVV దానయ్య(RRR), TG విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), గీతా ఆర్ట్స్ సంస్థ, నిర్మాత బన్నీ వాసు, RRR టీం, పుష్ప టీం, సీతారామం టీం, భగవంత్ కేసరి టీం , ప్రముఖ సంగీత దర్శకులు డా. కోటి, DSP, SS తమన్, MM శ్రీలేఖ, రఘు కుంచె, అనూప్ రుబెన్స్, హేషం అబ్దుల్ వహాబ్, గాయకులు మనో, ధనుంజయ్, తెలుగు సినిమాకి ఆస్కార్ ఖ్యాతి నందించిన లెజెండ్ ఎమ్.ఎమ్.కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, ఇంకా మరెందరో సినీ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, గాయనీ గాయకులు, కమెడియన్లు పాల్గొనేలా ప్రయత్నం చేస్తున్నామని, యాంకర్ సుమ, హైపర్ ఆది నిర్వహణలో ప్రముఖ టాలీవుడ్ గాయనీ గాయకులు కూడా హాజరు కానున్నారని గామా అవార్డ్స్ జ్యూరీ సభ్యులు మరియు గౌరవ సలహాదారుడు ప్రముఖ దర్శకులు శ్రీ VN ఆదిత్య తెలిపారు.