Gam Gam Ganesha to Release on May 31st: “బేబీ” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా “గం..గం..గణేశ”. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ కావడం విశేషం. ప్రచారం జరుగుతున్నట్టుగానే ఇవాళ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. మే 31న “గం..గం..గణేశా” సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. “గం..గం..గణేశా” రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అయితే ఆసక్తికరంగా ఉంది.
Sabari: ‘శబరి’ టైటిల్ అందుకే పెట్టాం.. వరలక్ష్మీని ఎంచుకున్నాం: దర్శకుడు అనిల్ ఇంటర్వ్యూ
కొండ అంచున నిలబడి ఉన్న హీరో ఆనంద్ గన్ ఫైర్ చేసినప్పుడు ఆ గన్ నుంచి గులాబీ రేకలు వస్తున్నట్లు పోస్టర్ డిజైన్ చేశారు. సరికొత్త కంటెంట్ తో ఈ సమ్మర్ లో అన్ని వర్గాల ఆడియన్స్ ను “గం..గం..గణేశా” ఎంటర్ టైన్ చేయనుంది. ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గ నటిస్తున్న ఈ సినిమాలో కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు కీలక ఆఫ్టర్లో నటిస్తున్నారు. పూజిత తాడికొండ కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించిన ఈ సినిమాకి కిరణ్ మామిడి ఆర్ట్ డైరెక్టర్ గా కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్ గా వ్యవహరించారు. ఆదిత్య జవ్వాడి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకి చేతన్ భరద్వాజ్ సంగీతం పొలాకి విజయ్ కొరియోగ్రఫీ అందించారు.