Rajamouli: ఎంత ధైర్యం… జక్కన్నపైనే జోకులా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ ఎస్ రాజమౌళి… ఈ పేరు వింటే చాలు ఎన్నో ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న బాక్సాఫీస్ రికార్డులు కూడా భయపడతాయి. ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ దర్శక ధీరుడు ప్రస్తుతం సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల కన్నా ఎక్కువ మార్కెట్ ని మైంటైన్ చేస్తున్నాడు. రాజముద్ర పడితే చాలు ఆడియన్స్ బండ్లు కట్టుకోని థియేటర్స్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. బాక్సాఫీస్ రికార్డ్స్ ని ముందుగా నాన్-బాహుబలి రికార్డ్స్ గా… ఇప్పుడు అసలు బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ అని కాదు నాన్-రాజమౌళి రికార్డ్స్ ని చేసేసాడు జక్కన్న. అపజయమెరుగని ఈ మగధీరుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆస్కార్ నే ఇంటికి తెచ్చేసాడు. వరల్డ్ ఫేమస్, హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ కూడా రాజమౌళి మేకింగ్ కి ఫిదా అయ్యారు, అది ఆయన రేంజ్.
ఇలాంటి దర్శకుడు అంటే ప్రతి ఒక్కరూ జక్కనని రెస్పెక్ట్ ఇస్తారు… కానీ సోషల్ మీడియాలో ఇద్దరు మాత్రం జక్కనపై జోక్స్ వేస్తున్నారు. రాజమౌళిపై జోక్స్ వేస్తున్నారు అంటే సీరియస్ గా కాదు సరదాగానే… అసలు విషయం ఏంటంటే రాజమౌళి అనిమల్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కి గెస్టుగా రానున్నాడు. ఇదే ఈవెంట్ కి మహేష్ బాబు కూడా గెస్టుగా వస్తున్నాడు. మహేష్ బాబు, రాజమౌళి కలుస్తున్నారు అంటే SSMB 29 టాపిక్ పక్కా వస్తది కదా… అందుకే అనిమల్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి రాజమౌళిని ట్యాగ్ చేస్తూ… SSMB29 అప్డేట్ ఏమైనా ఉంటుందా అని అడిగారు. ఈ ట్వీట్ కి రాజమౌళి రెస్పాండ్ అయ్యే లోపు ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్విట్టర్ అక్కౌంట్ వెంటనే స్పందించింది. మా కెప్టెన్ అంత ఈజీగా రివీల్ చెయ్యడు అంటూ ట్వీట్ చేసింది. ట్రిపుల్ ఆర్ నుంచి ట్వీట్ రాగానే బాహుబలి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా ” ఆ విషయం మీకన్నా ముందు మాకే తెలుసు” అంటూ ట్వీట్ వచ్చింది. రాజమౌళిపై ఈ సరదా జోకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
Our captain doesn’t give anything that soon 🤭 https://t.co/rEZ6Tk9atv
— RRR Movie (@RRRMovie) November 26, 2023
We knew this before anyone else. 🤣🤣 https://t.co/cHuX4XiTbR
— Baahubali (@BaahubaliMovie) November 26, 2023
తాజావార్తలు
-
China Robot: చైనా రోబోలు.. భారత్కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
-
Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి అడ్డంకులు?
-
Meenakshi Natarajan: “మేము జోక్యం చేసుకోలేం”.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!