కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఏ సినిమా నుంచి మరో భారీ అప్డేట్ విడుదలైంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వానీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రంలో కియారా ‘ నదియా’ అనే కీలక పాత్రలో కనిపించనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో కియారా అద్వానీ పూర్తిగా కొత్త షేడ్‌లో, స్టైలిష్‌గా కనిపిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఆమె లుక్ చూస్తే ఈ సినిమాలో ఆమె పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథలో కీలకమైనదిగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
Also Read : TheRajaSaab : రాజాసాబ్ నాన్ థియేట్రికల్ రూమర్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నిర్మాత విశ్వప్రసాద్
‘KGF: చాప్టర్ 2’ తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం యష్ తిరిగి బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘టాక్సిక్’ సినిమా 2026 మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్‌ను ఖరారు చేయడంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్టైలిష్ ప్రెజెంటేషన్, డార్క్ ఫెయిరీ టేల్ టోన్, యష్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ‘టాక్సిక్’ పాన్ ఇండియా స్థాయిలో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. కియారా అద్వానీ ఫస్ట్ లుక్ రిలీజ్ తో టాక్సిక్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో నిలిచింది. సౌత్ లో వరుస ప్లాప్స్ అందుకున్న కియారా ఇప్పుడు రాబోతున్న టాక్సిక్ తో సాలిడ్ హిట్ అందుకుంటుందేమో చూడాలి.