కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు వివాదాలు కొత్తేమి కావు.. వ్యక్తిగతంగా కాకపోయినా సినిమాల పరంగా ఆయన ఎన్నో వివాదాలను ఎదుర్కొంటూనే వస్తున్నారు. ఇక ఆస్కార్ స్థాయికి వెళ్లిన ‘జై భీమ్’ ను కూడా కొన్ని కారణాల వల్ల వివాదాలు వెంటాడుతున్నాయి. సూర్య నటించిన ఈ చిత్రం ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత వన్నియర్ సామాజిక వర్గంకు చెందిన వారు తమ మనోభావాలు దెబ్బ తీసేలా కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయని తెలుపుతూ కోర్టుకు వెళ్లారు. రుద్ర వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ మొదట పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు పట్టించుకోలేదని సూర్య పై మాత్రమే కాకుండా నిర్మాతగా వ్యవహరించిన జ్యోతిక ఇంకా దర్శకుడు టీజే జ్ఞానవేల్ పై కూడా కోర్టులో కేసు వేశారు.
ఇక ఈ పిటిషన్ పై ఇటీవలే కోర్టు ఆ ముగ్గురు విచారణకు హాజరు కానీ కారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీపోలీసులను ఆదేశించింది. ఇక కోర్టు ఆదేశాలను ధిక్కరించలేని పోలీసులు తప్పని పరిస్థితులలో హీరో సూర్య తో పాటు చిత్ర బృందంపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమాను సినిమా గా చూడకుండా కొంతమంది పబ్లిసిటీ కోసం చిన్న చిన్న విషయాలను బయటికి లాగి మిగతవారిని కూడా రెచ్చగొట్టి ఇలాంటి వివాదాలను పుట్టిస్తున్నారని సూర్య అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కేసుపై సూర్య- జ్యోతిక దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.