Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గానం, మధురమైన ఆమె గాత్రం అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు. ఇక గతేడాది సునీత, వీరపనేని రామ్ అనే బిజినెస్ మ్యాన్ ను రెండో వివాహం చేసుకున్న విషయం విదితమే. పెళ్లి తరువాత సునీత ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటు నేటితరానికి నచ్చిన విధంగా ట్రెండ్ ఫాలో అవుతోంది. ఇప్పటివరకు సునీత సోషల్ మీడియాలో తనకు నచ్చిన ఫోటలను, తన షోస్ కు సంబంధించిన వివరాలను మాత్రమే చెప్తూ వచ్చేది. సోషల్ మీడియాలో కూడా ఆమె గొంతు వినాలనుకొనేవారు.. కనీసం రీల్స్ లోనైనా ఆమె సాంగ్స్ పాడితే పరవశించాలనుకొనేవారు చాలామంది ఉన్నారు. సునీత ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీరెందుకు రీల్స్ చేయడం లేదు.. మ్యూజిక్ రీల్స్ లో మీ గొంతు వినిపించండి అని అడిగేవారే ఎక్కువ అంటే అతిశయోక్తి లేదు.
ఇక ఎట్టకేలకు సునీత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను కూడా మ్యూజిక్ రీల్స్ చేయడానికి రెడీ అయ్యినట్లు చెప్పుకొచ్చింది. తన వన్ మినిట్ మ్యూజిక్ రీల్స్ కు అంతా సిద్ధం అయ్యిందని, సోమవారం తన మొదటి రీల్ రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక నుంచి ప్రతి రీల్స్ లో సునీత తన గానంతో అలరించనుంది. తప్పకుండ రేపు తన రీల్స్ చూసి సపోర్ట్ చేయాలనీ కోరింది. ఇక ఈ వీడియోపై అభిమానులు స్పందిస్తూ.. మీరు ఎప్పుడెప్పుడు ఈ విషయం చెప్తారా..? అని ఎదురుచూస్తున్నాం. మీ గొంతు వినడానికి మేము ఎప్పుడు సిద్దంగానే ఉంటాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి సునీత తన మొదటి రీల్ లో ఏ సాంగ్ వినిపించబోతుందో చూడాలి.