Aqua Marine: ఆక్వా మెరైన్ కు వ్యతిరేకంగా గళం విప్పిన సినీ ప్రముఖులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాజిక ప్రయోజనాలు కాపాడుకోవడం పర్యావరణ పరిరక్షణ పోరాడటం అనేది అందరి బాధ్యత. ఆ బాధ్యతను స్వచ్చందంగా చేపట్టి పోరాడుతున్నారు కొందరు సినీప్రముఖులు. కొత్వాల్ గూడ లో దేశంలోనే భారీ ఆక్వా మెరైన్ పార్క్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్క్ పర్యావరణానికి పెద్ద ముప్పు కాబోతుందని సినీ నటులు రేణూదేశాయ్, శ్రీదివ్య , దర్శకుడు శశికిరణ్ తిక్కా తో పాటు మరికొందరు ప్రముఖులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. ఏటువంటి పర్యావరణ అధ్యయనం లేకుండా చేపట్టిన ఈ అక్వా మెరైన్ పార్క్ నిర్మాణం ఆపివేయాలంటూ కోర్ట్ ను ఆశ్రయించారు. ఇటువంటి పార్క్ ల నిర్మాణం సింగపూర్ , మలేసియా వంటి దేశాలలో జరిగాయి మన దేశంలో ఎందుకు సాధ్యం కాదని కోర్ట్ ప్రశ్నించింది. అయితే వీటికి సమాధానం గా పిటీషనర్ తరపున న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపిస్తూ ఎటువంటి పర్యావరణ అధ్యయనం లేకుండా ఏర్పాటుచేసే ఈ పార్క్ లతో జలచరాలకు, వన్య ప్రాణులకు నష్టం వాటిల్లుతుందనే వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి, హెచ్ ఎమ్ డీ ఏ లకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ , జస్టిస్ తుకారంజీలు ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుంది.
ఈ సందర్భంగా పిటీషనర్స్ లో ఒకరైన దర్శకుడు శశికిరణ్ తిక్కా మాట్లాడుతూః
Also Read
- Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా 'పెద్ది' దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
- Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
- SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
- Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
పర్యావరణానికి చేటు చేసే విధంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ పై మేము చేస్తున్న ఈ పోరాటం కు మీ మద్దతు కూడా కావాలి. వేలాది జలచరాల మనుగడ కు ముప్పు వాటిల్లే ఆక్వా మైరైన్ పార్క్ లు పర్యావరణాన్ని దెబ్బ తీస్తాయి. వాటిని ఆహ్లాదం కోసం మనముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా చనిపోతాయి. తరువాత కత్రిమంగా ఏర్పాటు చేసిన లైట్స్ లో వాటి జీవనం అత్యంత బాధాకరంగా మారుతుంది. వేల గ్యాలన్ల నీటితో నడిచే ఈ ఆక్వా పార్క్ లు నీటి సమస్యకు కారణం అవుతాయి. ఇలాంటి పార్క్ ల నిర్మాణం చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అన్నారు.
నటి సద మాట్లాడతూః
ఇప్పటికే నగరంలో నీటి సమస్య చాలా పెరుగుతుంది. మూడు వేల గ్యాలన్ల నీటితో నిర్మాణం అయ్యే
ఇలాంటి ఆక్వా పార్క్ లు నీటి సమస్య కు కారణం అవుతాయి. సహాజంగా సముద్రాలలో పెరిగే
జలచరాలును పట్టి కత్రిమంగా నిర్మాణం అయ్యే ఇలాంటి పార్క్ లలో ఉంచడం వాటి ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. వాటిని పట్టి తెచ్చే ప్రక్రియలోనే చాలా జలచరాలు ప్రాణాలు కోల్పోతాయి.
ఇలాంటి పార్క్ లు కాకుడా ఎన్విరాన్ మెంట్ పై అవగాహాన పెంచే పార్క్ లను ఎచ్ ఎమ్ డి ఎ వారు ఏర్పాటు చేస్తే మంచిది. అన్నారు.
తాజావార్తలు
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
-
Tollywood: ఫేక్ హౌస్‌ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
-
Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!