Chiyan Vikram: అపరిచితుడు విజయవాడలో రికార్డ్.. విక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- విజయవాడలో "తంగలాన్" చిత్ర ప్రెస్ మీట్
- మూవీ ప్రమోషన్ కోసం విజయవాడ రావడం హ్యాపీగా ఉంది హీరో విక్రమ్
- బాబాయ్ హోటల్ లో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది
- తెలుగు ఆడియెన్స్ మంచి సినిమాకు ఎంతగా సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు
- నా 'అపరిచితుడు' సినిమా దేశంలోనే విజయవాడలో అత్యధిక రోజులు ఆడింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiyan Vikram On Tangalan Promotions: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. ఈ రోజు విజయవాడలో “తంగలాన్” చిత్ర ప్రెస్ మీట్ నిర్వహించారు.
Also Read: Sampath In Kannappa: కన్నప్ప నుంచి చండుడు లుక్.. హిస్టరీ ఏంటో తెలుసా?
Also Read
- Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం... 'రామాయణం' వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
- Mowgli : రోషన్ కనకాల కోసం బరిలోకి జూనియర్ ఎన్టీఆర్
- Srinidhi Shetty: రాగ పాత్రతో మరో ఫేస్ చూపించబోతోంది శ్రీనిధి.. ‘తెలుసు కదా’పై ఆసక్తికర కామెంట్స్!
- Saif Ali Khan : నాపై దాడి కొందరికి నాటకమైంది.. అసహనం వ్యక్తం చేసిన సైఫ్
ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ మాట్లాడుతూ – మా “తంగలాన్” మూవీ ప్రమోషన్ కోసం విజయవాడ రావడం హ్యాపీగా ఉంది. బాబాయ్ హోటల్ లో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. వీవీఐటీ కాలేజ్ విజిట్ చేశాం. అక్కడ స్టూడెంట్స్ ఎనర్జీ సర్ ప్రైజ్ చేసింది. తెలుగు ఆడియెన్స్ మంచి సినిమాకు ఎంతగా సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు. నా ‘అపరిచితుడు’ సినిమా దేశంలోనే విజయవాడలో అత్యధిక రోజులు ఆడింది. మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఇదొక బ్యూటిఫుల్ అడ్వెంచరస్ మూవీ. డైరెక్టర్ రంజిత్ ఈ సినిమాను అందంగా రూపొందించాడు. తంగలాన్ ఒక మంచి సినిమా. మీరంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూసి మీ రెస్పాన్స్ ఇస్తారా అని వెయిట్ చేస్తున్నాను. నా ఫేవరేట్ డైరెక్టర్ పా రంజిత్ గారితో ఈ మూవీ చేశాను. ప్రేక్షకులందరికీ నచ్చేలా అన్ని ఎమోషన్స్ తో రంజిత్ గారు ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక కొత్త వరల్డ్ లోకి మిమ్మల్ని “తంగలాన్” సినిమా తీసుకెళ్తుంది. ఆగస్టు 15న తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అన్నారు.
హాలీవుడ్ నటుడు డేనియల్ మాట్లాడుతూ – ‘తంగలాన్’ మూవీలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ నాది. ఈ చిత్రంలో విక్రమ్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. పా రంజిత్ అమేజింగ్ డైరెక్టర్. నన్ను ఈ మూవీలోకి తీసుకొచ్చిన నిర్మాత జ్ఞానవేల్ రాజాకు థ్యాంక్స్. థియేటర్స్ లో తప్పుకుండా చూడండి. అన్నారు.
Also Read:Anchor Soumya Rao: జబర్దస్త్ షో నుంచి అందుకే వెళ్ళిపోయ యాంకర్ సౌమ్యరావ్
హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ – ‘తంగలాన్’ ప్రమోషన్ కోసం విజయవాడ రావడం సంతోషంగా ఉంది. బ్యూటిఫుల్ ఫ్లేస్ ఇది. ఇక్కడ బాబాయ్ హోటల్ లో ఫుడ్ టేస్ట్ చేశాం. చాలా బాగుంది. మీ అందరు మా మూవీ టీమ్ పై చూపిస్తున్న లవ్ కు థ్యాంక్స్. ‘తంగలాన్’ లో ‘ఆరతి’ అనే క్యారెక్టర్ చేశాను. నా కెరీర్ లో చేసిన ది బెస్ట్ రోల్ ఇది. ఈ పాత్రలో నటించేందుకు చాలా కష్టపడ్డాను. ఇలాంటి ఒక గొప్ప మూవీలో నటించడం సంతోషంగా ఉంది. అన్నారు.
నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ ‘తంగలాన్’ సినిమా నుంచి మీరు ఇప్పటిదాకా చూసిన టీజర్, ట్రైలర్ కొంత మాత్రమే. సినిమాలో చాలా మెస్మరైజింగ్ కంటెంట్ ఉంది. ఛియాన్ విక్రమ్ అద్భుతమైన పర్ ఫార్మెన్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆయన ఈ క్యారెక్టర్ లో ఎలా నటించారని మీరు ఆశ్చర్యపోతారు. అంత డెడికేషన్‌తో విక్రమ్ నటించారు.’తంగలాన్’ సినిమాను మా టీమ్ తో పాటు ప్రేక్షకులకు మెమొరబుల్ మూవీ అవుతుంది. తప్పకుండా థియేటర్‌లో చూసి ఎంజారు చేస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు.
తాజావార్తలు
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..