ఇండియన్ సినిమాకి గ్రీక్ గాడ్ లాంటి హీరో హ్రితిక్ రోషన్… డాన్స్, యాక్టింగ్, సిక్స్ ఫీట్ హైట్, సిక్స్ ప్యాక్ బాడీ… ఆల్మోస్ట్ హాలీవుడ్ హీరోలా అనిపించే రేంజులో ఉంటాడు హ్రితిక్. ఇంత కంప్లీట్ యాక్టర్ ని ఇండియన్ స్క్రీన్ పైన చూడడం చాలా రేర్. ఎప్పటికప్పుడు యాక్షన్ సినిమాల్లో కొత్త పాయింట్ ని పరిచయం చేసే హ్రితిక్… లేటెస్ట్ గా 2024 సంక్రాంతికి ఫైటర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. దీపికా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇండియాస్ ఫస్ట్ కంప్లీట్ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ సినిమాగా ప్రమోషన్స్ జరుపుకున్న ఫైటర్ సినిమా, రిలీజ్ కి ముందున్న అంచనాలని అందుకోవడంతో ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. మార్నింగ్ షోకే వచ్చిన డివైడ్ టాక్… ఫైటర్ సినిమా బాక్సాఫీస్ పొటెన్షియల్ ని కంప్లీట్ గా కిల్ చేసింది.
యాక్షన్… అదిరిపోయే స్టంట్స్ ఉన్నాయి కానీ కోర్ ఎమోషనల్ పాయింట్ మిస్ అవ్వడంతో ఆడియన్స్ ఫైటర్ సినిమాకి కనెక్ట్ కాలేకపోయినట్లు ఉన్నారు. ఫైట్స్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలో కొంచెం కథాకథనాల విషయంలో తీసుకోని ఉంటే ఈరోజు ఫైటర్ రిజల్ట్ ఇంకోలా ఉండేది. మొదటి రోజు వీక్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఫైటర్ సినిమా… రెండో రోజు కాస్త పర్వాలేదు అనిపించింది. మూడు రోజుల్లో వంద కోట్ల మార్క్ రీచ్ అవ్వడంతో ఫైటర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోలుకుంటుందేమో అనుకున్నారు కానీ మొదటి మండే ఫైటర్ సినిమా క్రాష్ అయ్యింది. కేవలం 7-8 కోట్లనే కలెక్ట్ చేసి సింగల్ డిజిట్ కి పడిపోయింది. మేకింగ్ డే ఆర్ బ్రేకింగ్ డే అయిన మండే రోజున ఫైటర్ సినిమా ఆడియన్స్ ని హోల్డ్ చేయడంలో ఫెయిల్ అవ్వడంతో… బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. రానున్న రోజుల్లో ఫైటర్ సినిమా కోలుకోని నిలబడి బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోవాలి అంటే అద్భుతమే జరగాలి. ఇప్పటికైతే అలాంటి సూచనలు కనిపించట్లేదు.