Trinath Varma: కథలో కొత్తదనం ఉండాలే గానీ ఆ సినిమా విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎలాంటి భారీ కాస్టింగ్ లేకుండానే కథనాన్ని ప్రేక్షకుడికి అర్థమయ్యేలా మలిచి ఎంతోమంది కొత్త దర్శకులు సక్సెస్ అయ్యారు. అదే బాటలో ఇప్పుడు యువ దర్శకుడు శ్రావణ్ ఓ సరికొత్త ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘టూ సోల్స్’ అనే డిఫరెంట్ టైటిల్ తో విజయలక్ష్మి వేలూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇదే నెల 21న జనం ముందుకు వస్తోంది. త్రినాథ్ వర్మ, భావన సాగి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో. రవితేజ మహదాస్యం, మౌమిక రెడ్డి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
మనకు ఎదురయ్యే ఏ పరిచయం కూడా యాదృచ్ఛికం కాదు అనే కథా నేపథ్యంతో గతంలో ఎన్నడూ చూడని ఆసక్తికర ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను రూపొందించానని దర్శకుడు శ్రావణ్ తెలిపాడు. ఈ మూవీ గురించి చెబుతూ, “రెండు ఆత్మల మధ్య జరిగే ప్రయాణాన్ని సగటు ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్ అనిపించేలా తెరకెక్కించాను. అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలోని డైలాగ్స్ యువ హృదయాలను హత్తుకునేలా ఉంటాయి. ఈ చిత్రానికి ప్రతిక్ అభయంకర్, ఆనంద్ నంబియార్ సంగీతం అందించగా.. శశాంక్ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు” అని చెప్పారు.