Site icon NTV Telugu

Manoj Bajpai : ఫ్యామిలీ మ్యాన్ 3 స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

Tha Fm3

Tha Fm3

మనోజ్ బాజ్పాయ్ థియేటర్ కన్నా ఓటిటి ప్లాట్ ఫామ్స్ వైపే ఫోకస్ పెంచాడు. ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న ఇండియన్ వెబ్ సిరీస్ లలో ది ఫామిలీ మాన్ సిరీస్ ఒకటి. మనోజ్ బాజ్‌పేయీకి ఎంతో పేరు తెచ్చింది. రాజ్ & డీకే డైరెక్షన్‌లో వచ్చిన ఈ సిరీస్‌లో ‘శ్రీకాంత్ తివారి’గా ఆయన అందరి మనసు దోచుకున్నాడు. స్పై థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్‌తో రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు, ఇండియా – చైనా టెన్షన్‌ మధ్య, శ్రీకాంత్ మిషన్ కొత్త లెవల్‌లో సెట్ అవుతోందట. నవంబర్ నుంచి ఈ థర్డ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

Also Read : Exclusive : వార్ 2.. ఎండ్ కార్డ్స్ లో ఊహించని సర్ప్రైజ్.. గెట్ రెడీ ఫర్ డబుల్ బొనాంజా

70 స్, 80స్ లో ముంబై తిహార్ జైలు నుంచి తప్పించుకున్న ‘స్విమ్‌సూట్ కిల్లర్’ ను పట్టుకోవడమే ఒక పోలీస్ ఆఫీసర్ జీవిత లక్ష్యం. మణోజ్ బాజ్‌పేయీ, జిమ్ సార్భ్‌ ప్రధాన పాత్రల్లో ‘ఇన్‌స్పెక్టర్ జెండే’ అనే థ్రిల్లింగ్ సినిమా రానుంది. ఈ థ్రిల్లర్‌లో ఆ ఆఫీసర్‌గా మనోజ్ బాజ్‌పేయీ, విలన్‌గా జిమ్ సార్భ్  రెడీ అవుతున్నారు ఒక ఎపిక్ క్యాట్-అండ్-మౌస్ ఛేజ్‌కి సిద్ధ పడుతున్నారు. తెలుగులో హ్యాపీ సినిమాలో మనోజ్ బాజ్పాయ్ పోలీస్ ఇనిస్పెక్టర్ గా మల్టీ షేడ్స్ పెర్ఫామెన్స్ తో అలరించాడు. హిందీలో ‘ఇన్‌స్పెక్టర్ మధుకర్ జెండే’గా మనోజ్ బాజ్‌పేయీ మళ్ళీ యూనిఫాం ఎఫెక్ట్ చూపించబోతున్నాడు. ఈ సినిమా పోస్టర్‌లోనే ఒక ప్రశ్న  ‘జెండేబాద్! స్విమ్‌సూట్ కిల్లర్‌ను ఇన్‌స్పెక్టర్ పట్టుకుంటాడా?’ – అని రాసి ఉండటం తో క్యూరియాసిటీ పెంచేసింది. ఈ సినిమా సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Exit mobile version