అల్లు అర్జున్ తన సెలవుల కోసం యూరప్ వెళుతున్నాడని ఊహిస్తున్న తరుణంలో ఒక్కసారిగా హైదరాబాద్ లో దిగి అందరికి ట్విస్ట్ ఇచ్చాడు. దుబాయ్ లో 16 రోజుల వెకేషన్ ను ఎంజాయ్ చేసిన తర్వాత బన్నీ తాజాగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన రాక సందర్భంగా అల్లు అర్జున్ కుమార్తె అర్హ తమ ఇంట్లో పూలతో “వెల్ కమ్ నానా” అని ఫ్లోర్‌పై స్వాగత నోట్ రాసి సర్ప్రైజ్ చేసింది. ఇక కుటుంబం అతనికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసిందట.
Read Also : టీమ్ ఇండియా U19 స్కోర్ బోర్డ్ లో స్టార్ హీరో పేరు!!
ఇదంతా అయ్యాక తిరిగి తన కార్యాలయంలో అడుగు పెట్టిన అల్లు అర్జున్ కు అక్కడ కూడా తన టీం సప్రైజ్ ఇచ్చింది. ఆఫీస్ మొత్తాన్ని గంధపు దుంగలు, కేకులతో ‘తగ్గేదే లే’ అని వ్రాసి, చుట్టూ ‘పుష్ప’ వాతారణాన్ని సృష్టించింది. ఇక టీం తనపై కురిపించిన ప్రేమకు అల్లు అర్జున్ పొంగిపోయాడు. అదే విషయాన్ని తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. హీరో హైదరాబాద్‌లో దిగడంతో కొందరు అగ్ర నిర్మాతలు, స్టార్ డైరెక్టర్లు ఆయన్ను కలవాలని, అభినందించాలని, తదుపరి ప్రాజెక్ట్ ల గురించి చర్చించాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్ “పుష్ప 2” మినహా నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.