విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఎఫ్3. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నఈ చిత్రం మే 27 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్న విషయం విదితమే. ‘లైఫ్ అంటే మినిమమ్ ఇట్లా ఉండాలా.. ‘ అంటూ సాగిన ఈ సాంగ్ పార్టీ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిపోతుందని మేకర్స్ తెలిపారు.
ఇక ఈ సాంగ్ లో పూజా, వరుణ్, వెంకీ మామ ల డాన్స్ అదిరిపోయింది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ మరియు గీతా మాధురి హై పిచ్ తో ఆలపించారు. స్పైసీ సైరన్ పూజా హెగ్డే ఈ పాటలో గ్లామర్ విందును అందిస్తోంది. డబ్బు ఉంటె మనిషి లైఫ్ ఎలా ఉంటుంది అనే విధంగా లిరిక్స్ అన్ని క్యాచీగా ఉన్నాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ కు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం తనదైన స్టైల్లో సిగ్నేచర్ స్టెప్స్ ను అందించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక వీడియో చివర్లో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్టెప్స్ వేయడం ఆకట్టుకొంటుంది. ఇక ఈ చిత్రంలో తమన్నా భాటియా, మెహ్రిన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ టీమ్ ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.