‘ఎఫ్2’తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన వెంకటేశ్, వరుణ్ తేజ్.. ఇప్పుడు ‘ఎఫ్3’తో మరోసారి నవ్వులు పూయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మే 27వ తేదీన గ్రాండ్‌గా విడుదల అవుతోంది. ఆల్రెడీ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవ్వగా, ఈరోజు సాయంత్రం ఫంటాస్టిక్ ఈవెంట్‌ని మేకర్స్ నిర్వహించబోతున్నారు. ఈ వేడుక ఎన్టీవీలో లైవ్ ప్రసారం కానుంది. ఇతర ఈవెంట్లకు భిన్నంగా, మొత్తం సరదాగా సాగిపోయేలా ఈ ‘ఫంటాస్టిక్’ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
కాగా.. మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో, దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని మరింత కామెడీ, గ్లామర్ డోస్‌తో తెరకెక్కించాడు. మొదటి భాగం భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంతో రూపొందగా, ఈ సీక్వెల్ డబ్బు చుట్టే తిరుగుతుంది. ఆడియన్స్ అందరూ రిలేట్ అయ్యే అంశం కాబట్టి, ఈ సినిమా కూడా ఫస్ట్ పార్ట్ తరహాలో మంచి వినోదాన్ని అందించేలా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రోమోలు హిలేరియస్‌గా ఉండడంతో, ప్రేక్షకులు ఈ సినిమా రిలీజ్ కోసం వేచి చూస్తున్నారు.
ఫస్ట్ పార్ట్‌లో ప్రత్యేకంగా నిలిచిన వెంకీ హాసన్‌నే వెంకటేశ్ ఇందులోనూ కంటిన్యూ చేస్తుండగా, వరుణ్ తేజ్ మాత్రం ‘నత్తి’ సమస్యతో సరికొత్త అలరించబోతున్నట్టు కనిపిస్తోంది. అతనికి తోడుగా సునీల్ ఉండడం బోనస్‌గా చెప్పుకోవచ్చు. గ్లామర్ డోస్ కోసం సోనాల్‌ని, ప్రత్యేక ఆకర్షణ కోసం పూజా హెగ్డేని రంగంలోకి దింపారు. మంచి అంచనాల్ని మూటగట్టుకున్న ఈ సినిమా, ఫస్ట్ పార్ట్ తరహాలోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుందా? లేదా? వేచి చూడాల్సిందే!