Tollywood : ఏపీ, తెలంగాణ సినిమా ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తెలంగాణ, ఏపీ ఎగ్జిబిటర్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు దిల్ రాజ్, సురేష్ బాబుతో సమావేశం అయ్యారు. అద్దె ప్రాతిపదికన థియేటర్లను నడిపించలేమని.. పర్సెంటీజీ రూపంలో అయితేనే నడిపిస్తామంటూ తేల్చి చెప్పారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాయాలని నిర్ణయించారు. జూన్ 1 నుంచి నిరవధికంగా థియేటర్లు మూసేయాలని తీర్మాణం చేశారు. దీంతో జూన్ నుంచి విడుదల అవుతున్న సినిమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Rohini : లగ్జరీ విల్లా కొన్న బిగ్ బాస్ రోహిణి..