ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న 25వ సినిమా ‘ఎటర్నల్స్’. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఒకే స్క్రీన్ పై 10 మంది సూపర్ హీరోస్ ను ఈ సినిమాలో చూడవచ్చు. దీనిని దీపావళి కానుకగా నవంబర్ 5న ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. కొంత మంది సూపర్ హీరోలు గ్రూపులుగా ఏర్పడి భూమిని, భూమిపై ఉన్నమనుషులను కాపాడతారు. వీళ్ళనే ‘ఎటర్నల్స్’ అంటారు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు వాళ్లే ముందు ఉంటారు. మనుషుల్లో మానవత్వాన్ని బయటికి తీసుకొచ్చి అందరికీ సాయం చేస్తారు.
Read Also : దసరా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’దే !
ఈ సినిమాలో గెమ్మా ఛాన్, రిచర్డ్ మేడెన్, కుమాల్ నాంజాయిని, లియా మేక్ హ్యూజ్, బ్రెయిన్ టైరి హెన్రీ, లరెన్ రిడల్ఫ్, బ్యారీ కాగన్, డాన్ లీ, కిట్ హరింగ్టన్, సల్మా హాయక్, అకాడమీ అవార్డు గ్రహీత ఏంజెలీనా జోలీ నటించారు. దీనిని కెవిన్ ఫీజ్, నెట్ మూరె నిర్మించారు. గత ఏడాది ‘నోమద్ ల్యాండ్’ సినిమాతో అకాడమీ అవార్డు గెలుచుకున్న క్లో ఝా ‘ఎటర్నల్స్’ను తెరకెక్కించారు. ఒలంపియా గ్రహం నుంచి వేలాది సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చిన మరణం లేని ఏలియన్స్ ఈ ఎటర్నల్స్. వీళ్ళనే డేవిఎన్ట్స్ అంటారు. వీరికి ఎన్నో పవర్స్ ఉంటాయి. వీరు ఒకే రకమైన శక్తి కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది ఆలోచించే వాళ్ళు.. మరికొంత మంది శక్తివంతులు.. ఇంకొందరు ఫైటర్స్. ఆడియన్స్ పాయింటాఫ్ వ్యూలో ఆలోచిస్తే అవెంజర్స్ కంటే ఎటర్నల్స్ లోని ఈ 10 మంది సూపర్ హీరోలు చాలా శక్తివంతులు. మరి దీపావళికి రాబోతున్న ‘ఎటర్నల్స్’ అవెంజర్స్ ను మించి ఆకట్టుకుంటారేమో చూడాలి.