Essence Of Thandel: ఎసెన్స్ అఫ్ ‘తండేల్’.. ఈపాలి యేట..గురి తప్పేదెలేదేస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Essence Of Thandel Released: ‘తండేల్’ సినిమా యూనిట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇప్పుడు సినిమా షూటింగ్ ప్రాసెస్ ని ఆస్వాదిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి, తాజాగా‘తండేల్’ సారాంశాన్ని ఆవిష్కరించి ఎసెన్స్ ఆఫ్ తండేల్ అంటూ ఒక విజువల్ ట్రీట్ అందించారు మేకర్స్. చేపలు పట్టడానికి సముద్రం మధ్యలో ఉన్న యువ సామ్రాట్ నాగ చైతన్య పాత్రను పరిచయం చేయడంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ‘ఈపాలి యేట..గురి తప్పేదెలేదేస్…ఇక రాజులమ్మ జాతరే’ అని చైతు చెప్పిన మ్యాసీ డైలాగ్ అభిమానులను అలరించేలా ఉంది. అనుకోకుండా, చైతూ అండ్ టీమ్ పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించినప్పుడు, వారిని కరాచీలోని సెంట్రల్ జైలులో బంధిస్తారు, అక్కడ వారికి కఠినమైన శిక్షలు విధిస్తారు. జైలర్ జాతీయవాదాన్ని ప్రశ్నించినప్పుడు, కథానాయకుడు “మా నుంచి ఊడిపోన ఒక ముక్క… మీకే అంతుంటే.. ఆ ముక్కని ముష్టేసిన మాకెంతుటుంది… భారత్ మాతా కీ జై…” అని జైలర్ కి తగిన సమాధానం ఇవ్వడం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక రాజు ప్రేమికురాలిగా సాయి పల్లవి పోషించిన బుజ్జి తల్లి పాత్రని పరిచయం చేయడంతో గ్లింప్స్ ఆహ్లాదకరంగా ముగుస్తుంది. 126-సెకన్ల క్లిప్ రాజు ప్రపంచం, అతని రెండు విభిన్న పార్శ్వాలను చూపించేలా ఉంది.
Kanakamedala: జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు..
Also Read
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ఇది పాకిస్తాన్ తీర రక్షక దళానికి అనుకోకుండా పట్టుబడిన ఓ మత్స్యకారుని నిజజీవిత కథ. అతని ప్రేమకథను కూడా చాలా అందంగా ప్రజెంట్ చేయనున్నారు. ఈ గ్లిమ్ప్స్ లో నాగ చైతన్య మునుపెన్నడూ చూడని రస్టిక్ అవతార్‌లో కనిపించాడు. శ్రీకాకుళం యాసని అద్భుతంగా పలుకుతూ కనిపిస్తున్నారు. ఇక చైతు ప్రీ-ప్రొడక్షన్‌కి క్వాలిటీ టైం వెచ్చించి అక్కడి మాండలికం,బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుని నిలబడ్డాడు. ఇక సాయి పల్లవి అందంగా కనిపించింది. ఇద్దరూ కలిసి కనిపించనప్పటికీ, చైతు మాటలు, సాయి పల్లవి ఎక్స్ ప్రెషన్స్ ద్వారా సినిమాలో వీరిద్దరూ ఎలాంటి కెమిస్ట్రీని పంచుకున్నారు అనెడి గ్రహించవచ్చు. సన్నివేశాలు పెయింటింగ్ లాగా రూపొందించబడ్డాయి. ఇది ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌ను అందిస్తోంది. దర్శకుడు చందూ మొండేటి గ్లింప్స్ ద్వారా కోర్ పాయింట్‌ని వెల్లడించి, చాలా లేయర్‌లు ఉన్న సబ్జెక్ట్‌ని డీల్ చేయడంలో తన నైపుణ్యాన్ని చూపించాడని చెప్పచ్చు. చివరి పోర్షన్లలో ప్రేమకథను ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నిర్మాణంతో పాటు సాంకేతిక ప్రమాణాలు అత్యున్నతంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఆకట్టుకునే నేపధ్య సంగీతం, ముఖ్యంగా ప్రేమకథకు మరింత ఆకర్షణని తీసుకొచ్చిందని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు