Nara Rohit’s Landmark 20th Film Launched: ‘ప్రతినిధి 2’తో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తున్న హీరో నారా రోహిత్ తన ల్యాండ్‌మార్క్ 20వ సినిమాను అనౌన్స్ చేశారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (ఎస్‌పిపి) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్న ఈ సినిమాతో వెంకటేష్ నిమ్మల పూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. #NaraRohit20 అందరినీ ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ రోజు గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంచ్ అయింది. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి, విజయ్ కృష్ణ ఈ సినిమా స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. ప్రదీష్ ఎం వర్మ కెమెరా స్విచాన్ చేయగా, ముహూర్తం షాట్‌కి గౌతమ్‌రెడ్డి క్లాప్ కొట్టారు.
Vijay Binni : డైరెక్టర్ కావాలని వచ్చి కొరియోగ్రాఫర్ అయ్యా.. ‘నా సామిరంగ’ డైరెక్టర్ ఇంటర్వ్యూ
ఇక తొలి షాట్‌కి విజయ్‌కృష్ణ గౌరవ దర్శకత్వం వహించగా ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో విర్తి వాఘని కథానాయికగా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలలో నటించనున్నారు. యంగ్ అండ్ ప్రామెసింగ్ టెక్నికల్ టీం ఈ చిత్రానికి పని చేస్తున్నారని మేకర్స్ వెల్లడించారు. ప్రదీప్ ఎమ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కాగా, రాజేష్ పెంటకోట ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమఠం, విశ్వంత్, రూపా లక్ష్మి, సునైనా, రఘు బాబు వంటి వారు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.