Bichagadu 2: సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ తో గుండెల్ని పిండేస్తున్న విజయ్ ఆంటోనీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Antony: ‘బిచ్చగాడు’ మూవీతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ. తెలుగులోనూ ఈ చిత్రం చాలా పెద్ద విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా స్వీయ దర్శకత్వంలో ‘బిచ్చగాడు-2’తో వస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.
‘చెల్లి వినవే.. నా తల్లీ వినవే.. నీ అన్నను కానూ అమ్మను నేను.. చిట్టీ వినవే.. నా బుజ్జీ కనవే.. నీ పుట్టూ మచ్చై ఉంటా తోడూ’ అంటూ సాగే ఈ గీతాన్ని భాష్య శ్రీ రాయగా అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. సంగీతం విజయ్ ఆంటోనీ అందించాడు. అనాథలైన హీరో, అతని సోదరి చిన్నతనంలో అనుభవించిన కష్టాలు, సమస్యల నేపథ్యంలో సాగే గీతంలా కనిపిస్తోంది. ‘బ్రతుకులే వీధిపాలైనా.. నిన్ను రథములో తిప్పుకోనా.. భూమి బద్దలైపోయి రెండు ముక్కలైపోయినా.. ఊయలల్లే నేను మారి నిన్ను మోయనా.. ’ అంటూ ఆర్ద్రతతో నిండిన సాహిత్యంతో వినగానే హృదయం బరువెక్కేలా ఉందీ పాట. ‘బిచ్చగాడు2’ లో ఇదే హైలెట్ సాంగ్ లానూ కనిపిస్తోంది. ప్రతి ఒక్కరినీ కదిలించేలా పూర్తి ఎమోషనల్ టచ్ తో ఉంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలుండటంతో ఈ సమ్మర్ కు మంచి విజయాన్ని ‘బిచ్చగాడు-2’ అందుకుంటుందనిపిస్తోంది. విశేషం ఏమంటే… ఈ సినిమాలో హీరోగా నటించి, డైరెక్షన్ చేస్తూ, మ్యూజిక్ అందించడంతో పాటు విజయ్ ఆంటోని ఎడిటింగ్ సైతం తానే చేసుకుంటున్నాడు. ఇది అతని సొంత బ్యానర్ విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ పై నిర్మితం అవుతోంది. అతి త్వరలో జనం ముందుకు రాబోతున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.
Also Read
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
తాజావార్తలు
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!