Rajinikanth: ప్రస్తుతం ఇండస్ట్రీలో కుర్ర డైరెక్టర్ల హావా నడుస్తోంది. మొదట యంగ్ హీరోలతో హిట్ కొట్టడం.. ఆ తరువాత వెంటనే సీనియర్ హీరోల వద్ద నుంచి ఛాన్స్ అందుకోవడం జరుగుతుంది. ఇక తాజాగా అదే లిస్టులోకి చేరిపోయాడు కుర్ర డైరెక్టర్ వశిష్ఠ. నందమూరి కళ్యాణ్ రామ్ కు బింబిసార వంటి హిట్ ను అందించిన వశిష్ఠ మొదటి సినిమాతోనే టాలీవుడ్ చూపు మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను ఎంతో బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేసి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.
ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి దగ్గరదగ్గర నాలుగు నెలలు కావొస్తున్నా కుర్ర డైరెక్టర్ మరో సినిమాను ప్రకటించలేదు. అయితే అప్పట్లోనే వశిష్ఠ.. తన రెండో సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి స్పష్టత లేదు. అయితే నిన్న తలైవా పుట్టినరోజు కావడంతో వశిష్ఠ.. రజినీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపాడు. దీంతో వీరిద్దరి కాంబో కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. రజినీ కోసం ఒక సరికొత్త కథను వశిష్ఠ తీర్చిద్దినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కుర్ర డైరెక్టర్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయినట్లే.. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.