NTV Telugu Site icon

Nani: ధరణి రాకతో దద్దరిల్లిన తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్!

Nani

Nani

AHA: ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 వేదిక మీద ఈ వారం స్పెషల్‌ గెస్ట్ గా మెరవనున్నారు నేచురల్‌ స్టార్‌ నాని. ‘దసరా’ సినిమాతో నాని వందకోట్ల క్లబ్ లో చేరడమే కాదు…. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో దుమ్మురేపుతున్నారు. అదే జోష్‌తో ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 వేదిక మీద చార్మింగ్‌గా కనిపించనున్నారు. ఈ నెల 7, 8వ తేదీల్లో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్‌ ఐడల్‌2 ఎపిసోడ్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ వీకెండ్ లో టాప్‌ 10 కంటెస్టంట్లు మధుర గాయకుడు, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు, బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.

నేచురల్‌ స్టార్ పాల్గొంటున్న హై ఎనర్జీ ఎపిసోడ్స్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో నాని లేటెస్ట్ మూవీ ‘దసరా’లోని ‘చమ్కీల అంగీలేసి… ‘ పాటకు ఆయనతో కలిసి కంటెస్టంట్స్ గళం కలిపారు. అంతేకాదు… న్యాయ నిర్ణేతలు ఎస్‌.ఎస్‌. తమన్‌, గీతామాధురి, కార్తిక్‌, ఎస్పీ చరణ్‌తో కలిసి నాని కూడా ఈ వేదిక మీద ఓ పాట పాడ‌టం విశేషం. ఇక ఈ ఎపిసోడ్స్ లో బాలు కెరీర్ బెస్ట్ సాంగ్స్ తో ఆయనకు నివాళులర్పించారు కంటెస్టెంట్స్. విశేషం ఏమంటే ఈ వేదిక మీద సింగర్‌ కార్తికేయ… నాని మనసు గెలుచుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ గళం విన్న నాని మెస్మరైజ్‌ అయ్యారు. తన తదుపరి చిత్రాల్లో కార్తికేయకు గాయకుడిగా అవకాశం ఇస్తానని మాటిచ్చారు. నాని మాటలు విని 16 ఏళ్ల కార్తికేయ ఆనందానికి అవధుల్లేవు.