Nani: ధరణి రాకతో దద్దరిల్లిన తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AHA: ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2 వేదిక మీద ఈ వారం స్పెషల్ గెస్ట్ గా మెరవనున్నారు నేచురల్ స్టార్ నాని. ‘దసరా’ సినిమాతో నాని వందకోట్ల క్లబ్ లో చేరడమే కాదు…. ప్యాన్ ఇండియా రేంజ్‌లో దుమ్మురేపుతున్నారు. అదే జోష్‌తో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2 వేదిక మీద చార్మింగ్‌గా కనిపించనున్నారు. ఈ నెల 7, 8వ తేదీల్లో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్2 ఎపిసోడ్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ వీకెండ్ లో టాప్ 10 కంటెస్టంట్లు మధుర గాయకుడు, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు, బాలు తనయుడు ఎస్పీ చరణ్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.
నేచురల్ స్టార్ పాల్గొంటున్న హై ఎనర్జీ ఎపిసోడ్స్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో నాని లేటెస్ట్ మూవీ ‘దసరా’లోని ‘చమ్కీల అంగీలేసి… ‘ పాటకు ఆయనతో కలిసి కంటెస్టంట్స్ గళం కలిపారు. అంతేకాదు… న్యాయ నిర్ణేతలు ఎస్.ఎస్. తమన్, గీతామాధురి, కార్తిక్, ఎస్పీ చరణ్‌తో కలిసి నాని కూడా ఈ వేదిక మీద ఓ పాట పాడటం విశేషం. ఇక ఈ ఎపిసోడ్స్ లో బాలు కెరీర్ బెస్ట్ సాంగ్స్ తో ఆయనకు నివాళులర్పించారు కంటెస్టెంట్స్. విశేషం ఏమంటే ఈ వేదిక మీద సింగర్ కార్తికేయ… నాని మనసు గెలుచుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ గళం విన్న నాని మెస్మరైజ్ అయ్యారు. తన తదుపరి చిత్రాల్లో కార్తికేయకు గాయకుడిగా అవకాశం ఇస్తానని మాటిచ్చారు. నాని మాటలు విని 16 ఏళ్ల కార్తికేయ ఆనందానికి అవధుల్లేవు.
Also Read
- Vijay Sethupathi : ఇకపై గెస్ట్ రోల్స్ చేయను.. ఆ ఒక్క సినిమా తప్ప
- Lady Super Star : రీజనల్ సినిమాలకు స్వస్తి.. ఇకపై పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాలే
- Hridayam Murali OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన లేటెస్ట్ సూపర్ హిట్ ‘హృదయం మురళి’
- Varanasi : వారణాసి షూట్ ఆల్మోస్ట్ ఫినిష్.. సైలెంట్‌గా పని కనిచేస్తున్న రాజమౌళి
తాజావార్తలు
-
Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
-
Vijay Sethupathi : ఇకపై గెస్ట్ రోల్స్ చేయను.. ఆ ఒక్క సినిమా తప్ప
-
Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే
ట్రెండింగ్
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్‌ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!