మోడరన్ క్లాసిక్ అనగానే యూత్ అందరికీ గుర్తొచ్చే ఒకేఒక్క సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యూత్ ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది. ‘మస్త్ షేడ్స్ ఉన్నాయి రా నీలో, కమల్ హాసన్’, బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్, తాగుదాం, నాగుల పంచమికి సెలవు, డెవలప్, రాహు కాలంలో పుట్టి ఉంటారా నేను లాంటి డైలాగ్స్ ని యూత్ విపరీతంగా వాడుతూ ఉంటారు. ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటే, దర్శకుడు తరుణ్ భాస్కర్ మాత్రం ఈ నగరానికి ఏమైంది సినిమా సీక్వెల్ ని హోల్డ్ చేసి ‘కీడా కోలా’ అనే సినిమా అనౌన్స్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసేసాడు. తాగుదాం, గోవా పోదాం అనే సింగల్ వర్డ్స్ ని ఈ నగరానికి ఏమైంది సినిమాలో వాడిన తరుణ్ భాస్కర్ ఈసారి కీడా కోలా సినిమాలో ‘సీన్ అయితది’ అనే పదాన్ని వాడినట్లు ఉన్నాడు.
కీడా కోలా ప్రమోషన్స్ ని ఇప్పటికే స్టార్ట్ చేసిన మేకర్స్, బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఒక్కో ఆర్టిస్ట్ అప్డేట్ ని రివీల్ చేస్తున్నారు. బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్ లుక్స్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ మూవీ టీజర్ ని జూన్ 29న రిలీజ్ చెయ్యాల్సి ఉండగా జూన్ 28కి ప్రీపోన్ చేస్తూ తరుణ్ భాస్కర్ ట్వీట్ చేశాడు. కీడా కోలా టీజర్ ని జూన్ 28న రిలీజ్ చేసి 29న ఈ నగరానికి ఏమైంది సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. 28న కీడా కోలా చూసి 29న మీ గ్యాంగ్ తో కలిసి సినిమాకి రండి చూసుకుందాం అంటూ తరుణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు రీరిలీజ్ అయ్యి ఉంటాయి కానీ ఈ నగరానికి ఏమైంది కోసం గ్యాంగ్స్ మొత్తం కదిలి వెళ్లడానికి రెడీగా ఉన్నట్లు ఇంకో సినిమాకి ఇప్పటివరకూ జరగలేదు. మరి ఈ రీరిలీజ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
https://twitter.com/TharunBhasckerD/status/1672190304194301952