టాలీవుడ్ డ్రగ్స్ కేసు : మొదలైన రానా విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2017 డ్రగ్ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నేడు ఉదయం రానా ఈడీ ముందు హాజరయ్యారు. ఈ విచారణకు రానా ఆడిటర్ సతీష్ తోపాటు అడ్వకేట్ తో వచ్చారు. ప్రస్తుతం ఈడీ ఆఫీసులో రానాపై విచారణ కొనసాగుతోంది.
రానాను ముగ్గురు సభ్యుల బృందం విచారిస్తున్నట్టు తెలుస్తోంది. 2015 -17లకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ను రానా అధికారులకు సమర్పించారు. అందులో రెండు బ్యాంకు అకౌంట్లకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చారు. రానా బ్యాంకు అకౌంట్లను ఈడి బృందం పరిశీలిస్తోంది. ఇప్పటికే రానాకు సంబంధించిన రెండు బ్యాంక్ అకౌంట్ లకు సంబంధించిన స్టేట్మెంట్ లను ఈడీ తెప్పించుకుంది. రానా అకౌంట్ నుంచి కొన్ని అనుమానిత ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులకు డబ్బులు బదలాయింపు చేయడంపై ఈడి ఈ విచారణలో ఆరా తీయబోతోంది.
Also Read
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
డ్రగ్స్ ఆరోపణలపై పలు సందర్భాల్లో మాట్లాడిన రానా డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని, బాలీవుడ్‌తో సంబంధాలు, తరుచూ పార్టీలకు వెళ్తుండడంతో తనకు డ్రగ్స్ అలవాటు ఉందని ప్రచారం జరుగుతోందని, సినిమా వాళ్లు డ్రగ్స్ తీసుకుంటే తనకేం సంబంధం అని ప్రశ్నించారు. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. పిల్లలకు డ్రగ్స్ సరఫరాపై ప్రభుత్వం కఠినంగా ఉండాలి అని రానా గతంలో అన్నారు. మరి ఈడీ విచారణలో ఏం తేలనుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also : శంకర్, చరణ్ పాన్ ఇండియా మూవీ లాంచ్
నిన్న నటుడు నందు, డ్రగ్ డీలర్ కాల్విన్ మాస్కరేన్‌లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మంగళవారం ఉదయం నందు ఈడి కార్యాలయానికి రాగా ఎనిమిది గంటలకు పైగా ఆయనను ప్రశ్నించారు. వాస్తవానికి సెప్టెంబర్ 20న విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. కానీ ముందుగానే నందును ఎందుకు విచారించారు అన్నది ఇంకా తెలియరాలేదు. ఇక ఆయనను ప్రధానంగా ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ వివరాల గురించి అడిగినట్లు సమాచారం.
పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత గత వారంలో అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో రానా దగ్గుబాటి, రవితేజ, ముమైత్ ఖాన్, నవదీప్, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ పేర్లతో సహా 10 మంది ప్రముఖులకు ఈడీ నోటీసులు పంపింది.
మరో వైపు ప్రధాన నిందితుడు కాల్విన్ మస్కరేన్‌హాస్ తో పాటు మరో ఇద్దరు నిందితులు అబ్దుల్ వాహెద్, అబ్దుల్ ఖుద్దూస్‌ని కూడా ఈడీ అధికారులు విచారించారు. కొంతమంది టాలీవుడ్ ప్రముఖులతో వారు జరిపిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నించారు. 2017లో కస్టమ్స్ అధికారులు కాల్విన్ మస్కరేన్హాస్, మరో ముగ్గురిని అరెస్టు చేయడంతో డ్రగ్ రాకెట్ బయటపడింది. ఆ సమయంలో వారి వద్ద నుంచి 30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
- Tags
తాజావార్తలు
-
Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
-
PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
Thirukkural: పుతిన్‌కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
-
Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
-
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?