సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి సలార్ సీజ్ ఫైర్ సినిమా పోస్ట్ పోన్ అయినప్పటి నుంచి ఇండియా మొత్తం ఒకటే టాపిక్… డంకీ, సలార్ సినిమాలకి క్లాష్ జరుగుతుంది, ఈ వార్ లో ఎవరు గెలుస్తారు? అనేది ఇప్పుడు సినీ అభిమానుల్లో బేతాళ ప్రశ్నగా మిగిలింది. కింగ్ ఖాన్ vs డైనోసర్, క్లాష్ అఫ్ టైటాన్స్, ఇండియన్ సినిమా బాక్సాఫీస్ కింగ్ ఎవరో తెలిసిపోయే వార్ ఇది… ఇలా ఎన్ని పదాలు వాడాలో అన్నింటినీ షారుఖ్-ప్రభాస్ క్లాష్ ని వాడేశారు. టీజర్, ట్రైలర్ తో సలార్ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా పేరు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా ట్రైలర్ సలార్ సినిమా రేంజ్ ని అమాంతం పెంచేసింది. డిసెంబర్ 15న బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే ప్రీబుకింగ్స్ లో సలార్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసేలా ఉంది. ఏ సినిమాకైనా పర్ఫెక్ట్ హైప్ రావాలి అంటే ఒక సాలిడ్ ట్రైలర్ పడాలి. అది సలార్ విషయంలో పర్ఫెక్ట్ గా జరిగింది. ఇప్పుడు డంకీ ట్రైలర్ సమయం ఆసన్నమయింది.
డంకీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పర్వాలేదనిపించింది. సాంగ్స్ అయితే ఓకేగానే ఉన్నాయి కానీ అద్భుతం అనిపించే రేంజులో అయితే లేవు. ఇలాంటి సమయంలో డంకీ ట్రైలర్ మాత్రమే ఇప్పుడు సినిమాకి బజ్ జనరేట్ చెయ్యాలి. డంకీ డ్రాప్ 4గా ట్రైలర్ ఈరోజు బయటకి రానుంది. డంకీ సినిమా హిట్ అవుతుందా? షారుఖ్ ఖాన్ కి మరో వెయ్యి కోట్ల సినిమా అవుతుందా? రాజ్ కుమార్ హిరాణీ తన మ్యాజిక్ ని చూపిస్తారా లేదా అనేది ట్రైలర్ తో తేలిపోనుంది. ట్రైలర్ బాగుంటే డిసెంబర్ 21న షారుఖ్ హిట్ కొడతాడు, ట్రైలర్ తేడా కొడితే షారుఖ్ హిట్ స్ట్రీక్ కి బ్రేక్ పడినట్లే అవుతుంది. మరి ట్రైలర్ ఏ టైమ్ కి బయటకి వస్తుంది, ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి.