Guntur Kaaaram: మహేష్ మసాలా దమ్ము చూద్దురు.. గెట్ రెడీ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dum Masala Song Promo Released from Guntur Kaaaram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి నిరీక్షణ ఫలించింది. వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాలో ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయ్యి ‘దమ్ మసాలా’ ప్రోమోను విడుదల చేసింది. ఇక మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 7న సాంగ్ విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ పేర్కొంది. ఎదురొచ్చే గాలి, ఎగరేసున్న చొక్కాపై గుండీ, ఎగబడి ముందరికీ వెళ్ళిపోతాది నేనెక్కిన బండి, ఎర్రకారం-అరకోడి, మసాలా -ఫుల్ బీడీ అంటూ సాగుతున్న ఈ సాంగ్ ఆసక్తికరంగా సాగుతోంది. నిజానికి శుక్రవారం అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో ‘మసాలా బిర్యానీ’ అంటూ సాగే సాంగ్ బిట్ ఒకటి లీక్ అయ్యింది. అయితే ఇప్పుడు ఉన్న సాంగ్ అయితే కొంచెం భిన్నంగానే ఉంది.
Raghava Lawrence: అభిమానికి దిమ్మతిరిగే షాకిచ్చిన రాఘవ లారెన్స్
Also Read
- Chennai Love Story: 'బేబీ'ని మించిన హిట్.. 'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
- Chennai Love Story: 'చెన్నై లవ్ స్టోరీ' సక్సెస్ మీట్లో ఎమోషన్స్.. రూ.12 కోట్ల ఓపెనింగ్ నుంచి గౌరీ ప్రియపై ప్రశంసల వరద
- Kajal Aggarwal: కారవాన్లోకి దూసుకొచ్చి షర్ట్ విప్పేశాడు.. కాజల్ చెప్పిన షాకింగ్ ఘటన!
- Jyothika: ఇక చాలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. జ్యోతిక సంచలన పోస్ట్!
సంగీత దర్శకుడు తమన్ బాక్సులు బద్దలు అయిపోతాయని చెబుతున్నా ఆ రేంజ్ లో అయితే సాంగ్ కనిపించడం లేదు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో గుంటూరు కారం సినిమా తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు) ప్రొడ్యూస్ చేస్తున్న ‘గుంటూరు కారం’లో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలోకి సినిమా రానుండగా ఆ రోజు తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘హను – మాన్’, తర్వాత రోజు (జనవరి 13న) విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ‘సైంధవ్’, మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ‘ఈగల్’ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!