మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అనేక డబ్బింగ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అయి విజయం సాధించాయి. ఆ మధ్య మహానటిలో జెమినీగణేశన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో స్ట్రయిట్ తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. ఆలా తెలుగులో దుల్కర్ లీడ్ రోల్ లో వచ్చిన మొదటి సినిమా ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. రెండవ సినిమాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో దుల్కర్ వంద కోట్ల క్లబ్ లో చేరాడు.
Also Read : VD 12 : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ.?
ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ” కాంతా” అనే సినిమాను స్టార్ట్ చేసాడు. ఇటీవల మిస్టర్ బచ్చన్ లో అలరించిన భాగ్యశ్రీబోర్స్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను స్పిరిట్ మీడియా, దుల్కర్ సొంత ప్రొడక్షన్ వేఫారెర్ బ్యానర్స్ పై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఈ సినిమాను సైలెంట్ గా షూటింగ్ గా జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ ఏడాది ఆగస్టు 1న కాంత సినిమాలు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. 1950ల మద్రాస్ నేపథ్యంలో రూపొండుతున్న “కాంత” దుల్కర్ కెరీర్ లో మరోక మైల్ స్టోన్ సినిమాగా మారుతుందని టాక్ వినిపిస్తోంది.