Dulquer Salman: సీతారామం చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ సల్మాన్ ను తప్ప మరే హీరోను ఉహించుకోలేము.. ఈ ఎపిక్ లవ్ స్టోరీ లో రామ్ గా దుల్కర్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే.. అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సీతారామం’ అఖండ విజయాన్ని అందుకుంది. కాగా.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనే కాదు ఉత్తరానా తన సత్తా చాటుతోంది. ఇక హిందీ ‘సీతారామం’ విజయోత్సవ సభకు వచ్చిన దుల్కర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షారుక్ ఖన్ తో నన్ను పోల్చకండి అంటూ చేసిన వ్యా్‌ఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే షారుక్ తో పోల్చద్దంటే అర్థమేంటి? అని ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. అయితే దానికి దుల్కర్ జవాబు బెబుతూ.. నేను షారుక్‌కు పెద్ద అభిమాని అని, అంత పెద్ద స్టార్ హీరోతో నన్ను పోల్చడం ఏంటని అన్నాడట. అంతేకాదు.. షారుక్ సినిమాలను చూస్తూ పెరిగానని, ఎంతోమందికి షారుక్ ఒక స్ఫూర్తి అని చొప్పుకొచ్చాడు. షారుక్ తన అభిమానులను చూసుకునే తీరుకు నేనేప్పుడు ఆశ్చర్యపోతుంటాను అని దుల్కర్ చెప్పారు.
ఎవరైనా సరే షారుక్ తో మాట్లాడాలని వస్తే, ఆయన ఎంతమందిలో ఉన్నా ప్రతి ఒక్కరితో ఎంతో శ్రద్ధగా మాట్లాడతారని పొగడ్తలతో ముంచెత్తారు దుల్కర్. నేను చిన్నప్పుడు మా అక్కతో కలిసి షారుక్ సినిమాలను చూసేవాడినని, అలా చూసిన వాటిల్లో దిల్‌వాలే దల్హనియా లేజాయేంగే సినిమా నాకు చాలా ఇష్టమైన్నారు. ఒక్కసారికాదు ఆ సినిమా చాలాసార్లు చూశానన్నారు. తనకు ఎప్పుడైనా భవిష్యత్తుపై సందేహం వేసినప్పుడు షారుక్‌ను మనసులో తలచుకుంటా అంటూ దుల్కర్ చెప్పారు. షారుక్ కేవలం నటుడే కాదు, ఎంతో గొప్ప వ్యక్తి అని అన్నారు. పక్కవారితో.. నేను ఎలా మాట్లాడాలో ఆయన్ని చూసే నేర్చుకున్నాను అని తెలిపారు. తనకు తెలియకుండానే షారుక్ నాపై చాలా ప్రభావం చూపారని అన్నారు. నన్ను ఆయనతో పోల్చడం నా దృష్టిలో ఆయన్ని అవమానించినట్లే.. ఎందుకంటే షారుక్ లాంటి వ్యక్తి మరొకరు ఉండరు అంటూ తన వీరాభిమానాన్ని దుల్కర్ సల్మాన్ తెలియజేశారు.
Flexi War in Khammam: అధికార పార్టీలో ప్లెక్సీల వార్.. ఊడిగం చేయొద్దని ఎంపీలు, ఎమ్మెల్సీ ఫైర్