పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్ అభిమానుల రచ్చ మామూలుగా లేదు. థియేటర్లు మొత్తం ‘పుష్ప’ ఫైర్ కు దద్దరిల్లుతున్నాయి. ‘పుష్ప’రాజ్ గా అల్లు అర్జున్ థియేటర్లలో చేసిన యాక్షన్ ను ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరోవైపు విమర్శకులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సమంత ఐటెం సాంగ్ థియేటర్లలో ఆమె అభిమానులను ఊపేస్తోంది. ఇక తెలంగాణాలో బెనిఫిట్ షోలకు అనుమతి లభించడంతో ఈరోజు ఉదయం నుంచి బెనిఫిట్ షోలు ప్రారంభమయ్యాయి. అయితే ఆంధ్రా సినీ ప్రియులకు మాత్రం నిరాశ తప్పలేదు.
Read Also : అంటుకున్న ‘పుష్ప’ ఫైర్… ‘తగ్గేదే లే’ అంటూ స్టార్ హీరోల సపోర్ట్
టికెట్ ధరల విషయం అలా ఉంచితే, అక్కడ చాలా చోట్ల బెనిఫిట్ షోలు కూడా లేవు. దీంతో ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న అభిమానులు థియేటర్లో ఏదైనా తక్కువైనా, లేదా పొరపాటు జరిగినా ఊరుకుంటారా ? ఇప్పుడు తిరుపతిలో అదే జరిగింది. పళణి సినిమా హాల్లో సౌండ్ సరిగా పెట్టలేదని ఆగ్రహంతో అద్దాలు, కుర్చీలు ధ్వంసం చేసేశారు అభిమానులు. ముఖ్యంగా శ్రీవల్లి ఎంట్రీకి సౌండ్ లేకపోవడం వారిని ఫైర్ అయ్యేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.