Tollywood: ఈ వారం డబ్బింగ్ సినిమాలదే సందడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: సెప్టెంబర్ మొదటి వారం నుండి ప్రతి వీకెండ్ ఆరేడు సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఆ జోరుతో పోల్చితే ఈ వారం బాక్సాఫీస్ దగ్గర డైరెక్ట్ తెలుగు సినిమాల సందడి కాస్తంత తగ్గబోతోంది. ఎందుకంటే ఈ వారంలో రెండు పెద్ద తమిళ అనువాద చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో మొదటిది ‘నేనే వస్తున్నా’. ధనుష్ హీరోగా అతని అన్నయ్య సెల్వరాఘవన్ తెరకెక్కించిన సినిమా ‘నానే వరువెన్’. దీనిని తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో డబ్ చేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఇది గురువారం జనం ముందుకు వస్తోంది. కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేస్తుండటం విశేషం.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ సైతం ఈ శుక్రవారం విడుదల అవుతోంది. విక్రమ్, కార్తి, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్, త్రిష తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు. చోళ రాజుల కథను వెండితెరపై ఆవిష్కరించాలన్నది మణిరత్నం చిరకాల వాంఛ. రెండు భాగాలుగా రూపుదిద్దుకోనున్న ‘పొన్నియన్ సెల్వన్’లో మొదటి భాగాన్ని శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. దీనిని తమిళంలోనే కాకుండా వివిధ భారతీయ భాషల్లోనూ డబ్ చేసి పాన్ ఇండియా స్థాయిలో జనం ముందుకు మణిరత్నం తెస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ‘దిల్’ రాజు పంపిణీ చేస్తున్నారు. ఈ రెండు పెద్ద సినిమాలే ఈ వారం సింహభాగం థియేటర్లను ఆక్యుపై చేసుకుంటున్నాయి. ఇక చిన్న చిత్రాలు ‘నేను కేరాఫ్ నువ్వు’, ‘లాట్స్ ఆఫ్ లవ్’ శుక్రవారం వస్తుంటే, ‘బలమెవ్వడు’ సినిమా అక్టోబర్ 1, శనివారం నాడు థియేటర్లలో విడుదల కాబోతోంది.
Also Read
- Akkineni Nagarjuna : అఖిల్‌కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
- Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
- Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. 'జైలర్' విలన్ వినాయకన్‌పై మరో కేసు
- Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా 'శ్రీశ్రీ'.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
తాజావార్తలు
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
-
Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
-
Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్‌లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే ‘అగ్ని పరీక్ష’!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్‌ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!