Double ISMART Theatrical Release For Independence Day On August 15: ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప 2 వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ డేట్ కోసం సినిమాలు కర్చీఫ్ లు వేసుకుంటున్నాయి. ఆగస్టు 29న ఇప్పటికే డేట్ సెట్ చేసుకున్న నాని సరిపోదా శనివారం ఆగస్టు 15 డేట్ మీద కన్నేయగా ఇపుడు డబుల్ ఇస్మార్ట్ కూడా అదే డేట్ మీద కన్నేసింది. అంతేకాదు ఆరోజు బరిలోకి దిగుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది కూడా. ఉస్తాద్ రామ్ పోతినేని, సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ తమ భారీ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు. ఈరోజు సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ను రిలీజ్ చేశారు. దాని ప్రకారం డబుల్ ISMART ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున సినిమా థియేటర్లలోకి రానుంది. ఇక సినిమా విడుదలకు స్వాతంత్ర్య దినోత్సవం సరైన సమయం అని అందరికీ తలెస్సు.
Raveena: జర్నలిస్టుకు ఝలక్.. రవీనా టాండన్ 100 కోట్ల పరువు నష్టం దావా
గురువారం సెలవు కాగా, సోమవారం (రక్షాబంధన్) మరో సెలవుదినాన్ని కూడా సినిమా క్యాష్ చేసుకునేందుకు సిద్ధం అయింది. ఇక పవర్ ఫుల్ రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ పవర్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపిస్తున్నాడు. విభూతి ధరించి కాస్త గంభీరంగా కనిపించాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో ఒక శివలింగం, జ్వాలాఫలకాన్ని కూడా చూడవచ్చు. ఇక ముందు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లతో ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. ఇక యాక్షన్ అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఇస్మార్ట్ శంకర్ కి ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమా డబుల్ ఇంపాక్ట్ ఇవ్వబోతోందని అంటున్నారు. ఈ ఇనిమలో సంజయ్ దత్ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. రామ్ సరసన కావ్య థాపర్ కథానాయికగా అందిస్తుండగా మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రాఫర్‌లు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక డబుల్ ISMART తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల చేయబడుతుంది.