Nikhil: ‘ఆర్ఆర్ఆర్’ కు ఆస్కార్ అవసరమా.. సంచలన వ్యాఖ్యలు చేసిన నిఖిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikhil: యంగ్ హీరో నిఖిల్ సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా హీరోలానే మాట్లాడుతుంటాడు. ఏ విషయమైనా తనకు నచ్చకపోతే ఎవరు ఏమంటారు అనేది ఆలోచించకుండా తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా నిఖిల్ ఆస్కార్ అవార్డుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకోలేకపోవడంతో ప్రతి ఒక్కరు బాధపడుతున్న విషయం విదితమే.. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ లో ఉంటుందని భావించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయమై నిఖిల్ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆస్కార్ మనకు ఎందుకు..? మనకు అవసరమా..? అంటూ చెప్పుకొచ్చాడు.
” మీరెవ్వరు నన్ను తప్పుగా అనుకోకండి. నాకు ఆస్కార్ అవార్డుల పై అంత పెద్ద ఆసక్తి లేదు. మంచి అభిప్రాయం కూడా లేదు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఆస్కార్ రావాలని, వస్తే బావుంటుందని అనుకుంటారు. కానీ, నాకు మాత్రం ప్రజల నుంచి వచ్చే ప్రశంసలే ఆస్కార్ కంటే గొప్పవిగా భావిస్తాను. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవసరమా.. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రశంసలు అందించారు. అదే పెద్ద విజయం. మనకు ఫిల్మ్‌ఫేర్, జాతీయ అవార్డులు..ఇలా మన సొంత అవార్డులు ఉన్నాయి.. మనకింక ఆస్కార్ ఎందుకు..? నేనేదో ఆస్కార్ కు ప్రాముఖ్యత ఇవ్వడంలేదని తిట్టకండి.. అసలు మన సినిమాలకు ఆస్కార్ సర్టిఫికెట్ ఎందుకు.. అవసరమా.. ? మన సినిమాలు అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం భారతీయ సినిమాలు అన్నిచోట్లా సంచలనం సృష్టిస్తున్నాయి. నేను ఇటీవల స్పెయిన్ వెళ్ళినప్పుడు ఆర్ఆర్ఆర్ చూసాను.. థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ఒక్క స్పెయిన్ అనే కాదు.. అన్ని దేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ షేక్ చేస్తోంది.. అలాంటప్పుడు అంతకు మించిన ఆస్కార్ సర్టిఫికెట్ మనకు ఎందుకు..?” అని చెప్పుకొచ్చాడు. అయితే నిఖిల్ చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
- Tags
- karthikeya 2
- Nikhil
- oscar 2023
- rrr
తాజావార్తలు
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!