Krithi Shetty : టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ భామ యూపీని సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయింది.బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమాతో కృతి శెట్టి క్రేజీ హీరోయిన్ గా మారింది.ఈ భామకు వరుస ఆఫర్స్ వచ్చాయి.అయితే ఈ భామకు గత కొంత కాలంగా లక్ కలిసి రావడం లేదు.ఈ భామ నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోతుంది.ప్రస్తుతం ఈ భామ శర్వానంద్ హీరోగా నటిస్తున్న “మనమే” సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
Read Also :Aranmanai 4 : ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ్ హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది.తెలుగు సినిమాలలో నటించే ముందు కొన్ని తెలుగు సినిమాలు చూసాను.అందులో రాంచరణ్ గారి రంగస్థలం మూవీ చూసాను.ఆ సినిమాలో రాంచరణ్ గారి యాక్టింగ్ చూసి ఆయనకు పెద్ద ఫ్యాన్ అయ్యాను.షూటింగ్ సమయంలో ఆయన్ ఎంతో డెడికేషన్ గా వుంటారు.దర్శకుడు తీసే ఆ షాట్ కోసం ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు.రాంచరణ్ గారి సరసన నటించే అవకాశం వస్తే ఎంతో ఎక్సయిటింగ్ గా ఫీల్ అవుతాను.ఆయనతో కలిసి నటించేటప్పుడు ఎంతో హార్డ్ వర్క్ చేస్తాను అని కృతి శెట్టి తెలిపింది.