Aranmanai 4 : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మిల్కీ బ్యూటి తమన్నా,రాశీ ఖన్నా ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ తమిళ్ హారర్ కామెడీ మూవీ అరణ్మనై 4.తమిళ్ సూపర్ హిట్ హర్రర్ కామెడీ ఫ్రాంచైజీ నుంచి నాలుగో సినిమాగా అరణ్మనై 4 తెరకెక్కింది. ఈ సినిమాను డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన సుందర్ సి తెరకెక్కించారు.ఈ అరణ్మనై 4 చిత్రాన్ని తెలుగులో “బాక్” అనే టైటిల్ తో మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ హారర్ కామెడీ సిరీస్ తమిళ్ తో పాటు తెలుగులో కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.అయితే ఈ సారి దర్శకుడు సుందర్ సి బాక్ అనే దెయ్యం కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
Read Also :Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ మూవీ రన్ టైం లాక్..?
అస్సాంలో బాక్ అనే దెయ్యం ఎంతో పాపులర్..అస్సామీకి చెందిన బాక్ అనే దెయ్యం సౌత్‌కు వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్టుతో డైరెక్టర్ సుందర్ సి ఈ అరణ్మనై 4 చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. అరణ్మనై 4 సినిమా మే 3న ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. తమిళ్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్నట్లు సమాచారం.ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా ఓటిటి హక్కులను దక్కించుకుంది.ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‍ను త్వరలోనే హాట్‍స్టార్ వెల్లడించనుంది.