Site icon NTV Telugu

Samantha’s hand painted saree : ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !!

Samantha

Samantha

సౌత్ క్వీన్ సమంత ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ ను సృష్టిస్తూ ఉంటుంది. ఆమె స్టైల్ ను చూసి ఫ్యాషన్ ప్రియులు సైతం అబ్బురపడుతూ ఉంటారు. తాజాగా ఈ బ్యూటీ హ్యాండ్ పెయింటెడ్ శారీలో మెరిసింది. నటి అర్చన జాజు చేతితో పెయింట్ చేసిన చీర కట్టుకుని అద్భుతమైన లుక్‌ తో ఆకట్టుకుంటోంది. సామ్ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో ఏముంది ? అంటే… ఆమె కట్టుకున్న చీర ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే. అభిలాషా ప్రెట్ జ్యువెలరీ ద్వారా స్టేట్‌మెంట్ చెవిపోగులతో కన్పించిన సామ్ చీర ధర రూ.1,14,999. ఇక సామ్ కు అద్భుతమైన స్టైలిస్ట్‌ల బృందం ఉంది. లేటెస్ట్ లుక్‌ని ప్రీతం జుకల్కర్ రూపొందించగా, మేకప్ అవ్నీ రంభియా చేసింది. ఇక సామ్ జుట్టును రోహిత్ భట్కర్ స్టైల్ చేసింది.

Read Also : Srabanti Chatterjee : హీరోయిన్ పై కేసు… అడ్డంగా బుక్ చేసిన ముంగీస

సమంత సినిమాల విషయానికొస్త… గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో నయనతార, విజయ్ సేతుపతితో కలిసి ‘కాతు వాకుల రెండు కాదల్’ రిలీజ్ కానుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఇక సమంత ప్రస్తుతం హరి శంకర్ అండ్ హరీష్ నారాయణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘యశోద’ చిత్రంలో నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించిన ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌’తో సమంత హాలీవుడ్‌లో కూడా అడుగు పెడుతోంది.

Exit mobile version