‘కేజీఎఫ్’ స్టార్ అసలు పేరు తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కేజీఎఫ్’ చిత్రంతో కన్నడ స్టార్ యష్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. 2018లో విడుదలైన ఈ సినిమాతో యష్ కు భారీ క్రేజ్ మాత్రమే కాకుండా కన్నడ చిత్రసీమపై అందరి దృష్టి పడింది. ఈ రోజు యష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో యష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పేరును ట్రెండ్ చేస్తున్నారు. యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
Read Also : రష్మిక మందన్న కాదు మడోనా… ‘పుష్ప’రాజ్ పేరు మార్చేశాడే !!
Also Read
- Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ చూశారా!
- 72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
- Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
- Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
1986 జనవరి 8న కర్ణాటకలో జన్మించిన యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. యష్ తండ్రి అరుణ్ కుమార్ కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో డ్రైవర్, తల్లి పుష్ప గృహిణి. మైసూరులో చదువు పూర్తి చేసిన యష్ నటనపై మనసు పారేసుకున్నాడు. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టి ముందుగా బుల్లితెర హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. టెలివిజన్ సీరియల్ ‘నంద గోకుల’తో యష్ తన కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత కూడా యష్ మరెన్నో టీవీ సీరియల్స్‌లో నటించాడు. 2008లో వచ్చిన ‘మొగ్గిన మనసు’ సినిమాతో వెండితెర అరంగ్రేటం చేశాడు యష్. ఇక తరువాత వరుస సినిమాలు చేస్తూ వచ్చిన యష్ “కేజీఎఫ్”తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘కేజీఎఫ్-2’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!