రష్మిక మందన్న కాదు మడోనా… ‘పుష్ప’రాజ్ పేరు మార్చేశాడే !!

రష్మిక మందన్న పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి క్రేజ్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ బ్యూటీని అభిమానులు ప్రేమగా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు. కానీ ఇప్పుడు ఆమె పేరు మారింది. రష్మిక మందన్న కాదు… రష్మిక మడోనా అట! ‘పుష్ప’రాజ్ ఈ కన్నడ సోయగం పేరును మార్చేశాడు. అసలు ఏం జరిగిందంటే ?

Read Also : ఆసుపత్రిలో కట్టప్ప… కరోనాతో సీరియస్

అమెజాన్ ప్రైమ్ లో నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన “పుష్ప” చిత్రం విడుదలైంది. ఈ పాన్ ఇండియా మూవీ అనుకున్న దానికంటే ముందుగానే అమెజాన్ లో విడుదల కావడంతో నిన్న రాత్రి బన్నీ అభిమానులతో పాటు సినిమాపై ఆసక్తి ఉన్నవారంతా టీవీలకు అతుక్కుపోయారు. కొంతమంది సినిమా చూసి హాయిగా పడుకుంటే… మరికొంత మంది మాత్రం టైటిల్స్ దాకా వచ్చిన చిన్న చిన్న తప్పులను గమనించే పనిలో పడ్డారు. అందులో ఓ విషయంలో మాత్రం మేకర్స్ దొరికిపోయారు.

Read Also : ఆస్కార్ విన్నింగ్ లెజెండరీ నటుడు కన్నుమూత

రష్మిక అభిమానులు మేకర్స్ టైటిల్స్ లో ఆమె పేరును మర్చి వేయడం గమనించారు. రష్మిక పేరు ఎండ్ టైటిల్స్ లో “రష్మిక మడోనా” అని పెద్దగా వేయడం చూశారు. దీంతో ఆశ్చర్యపోయిన కొందరు ప్రత్యేకంగా దాన్ని స్క్రీన్ షాట్ తీసి మరీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇప్పుడు జరిగే చర్చలో అసలు రష్మిక పేరును అనుకోకుండా తప్పుగా వేశారా ? లేదంటే ఆమె పేరు మార్చుకుందా ? అని. మరి మేకర్స్ తో పాటు రష్మిక దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

రష్మిక మందన్న కాదు మడోనా… 'పుష్ప'రాజ్ పేరు మార్చేశాడే !!

Related Articles

Latest Articles