‘పలాస’ ఫేమ్ రక్షిత్ అట్లూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శశివదనే’. కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సాయి మోహన్ ఉబ్బన డైరెక్ట్ చేస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని అహితేజ బెల్లంకొండ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. రీసెంట్ గా శశివదనే టైటిల్ సాంగ్ ని లాంచ్ చేసి అట్రాక్ట్ చేసిన చిత్ర యూనిట్… లేటెస్ట్ గా ‘డీజే పిల్లా’ అనే క్యాచీ నంబర్ ని రిలీజ్ చేసారు. ఈ సెకండ్ లిరికల్ సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లాంచ్ చేసాడు. శరవణ వాసుదేవన్ ఇచ్చిన జోష్ ఫుల్ ట్యూన్ కి కిట్టు విస్సాప్రగడ అందరూ హమ్ చేయగలిగేలాంటి లిరిక్స్ ని రాసాడు. సింగర్ వైశాగ్ ‘డీజే పిల్లా’ సాంగ్ కి బిగ్గెస్ట్ ఎస్సెట్ అయ్యాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లీడ్ పెయిర్ పైన డిజైన్ చేసిన ఈ సాంగ్ లిరికల్ వీడియో చేసిన వాళ్లు ఎవరో కానీ టెక్నీషియన్స్ అందరి కార్డ్స్ వేసిన వాళ్లు, ఖోరియోగ్రాఫర్ టైటిల్ కార్డ్ ను వేయడం మర్చిపోయినట్లు ఉన్నారు.
ఈ కారణంగా సాంగ్ లో ఖోరియోగ్రాఫర్ పేరు లేకుండా పోయింది. అయితే ఈ సాంగ్ కి ‘జేడి మాస్టర్’ ఖోరియోగ్రఫి చేశాడు. రక్షిత్-కోమలీ పెయిర్ చూడగానే నచ్చేలా ఉంది. డీజే పిల్లా సాంగ్ లో ఈ పెయిర్ మరింత అట్రాక్టివ్ గా ఉన్నారు. ముఖ్యంగా సాంగ్ లోని హుక్ స్టెప్స్ ని రక్షిత్ అండ్ కోమలీ చాలా బ్యూటిఫుల్ గా చేసారు. పెద్దగా హంగామా చేయకుండా జేడీ మాస్టర్, హుక్ స్టెప్స్ ని క్యూట్ గా కంపోజ్ చేసారు. దీంతో ప్రస్తుతం డీజే పిల్లా సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇన్స్టాలో సాంగ్ పై హుక్ స్టెప్స్ తో అప్పుడే రీల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. చిన్న సినిమా అయినా సాంగ్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్న ఈ కాలంలో శశివదనే మొదటి రెండు పాటలతోనే రెండు సిక్సర్లని కొట్టింది.’శశివదనే’ టీం ఇదే జోష్ ని కంటిన్యు చేస్తే రిలీజ్ సమయానికి మంచి అంచనాలని సెట్ చేసే ఛాన్స్ ఉంది.