సందీప్ కిషన్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వంలో నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్నఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా దివ్యాంక కౌశిక్ ను ఎంపిక చేశారు.
Read Also : నాని సెన్సార్ టాక్ ని అధిగమిస్తాడా!?
ఈ విషయం గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ”ఈ మధ్యే షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలోని ప్రతీ పాత్రకు ఓ ప్రాముఖ్యత ఉంది. స్టార్ డైరెక్టర్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి, ఎన్నో చిత్రాలు, వెబ్ సిరీస్‌లో నటించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ‘మజిలీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి చక్కని విజయాన్ని అందుకున్న దివ్యాంక కౌశిక్‌ను ఇందులో హీరోయిన్ గా ఎంపిక చేశాం. ఇందులో ఆమెది చాలా కీలకమైన పాత్ర. అలానే సందీప్ కిషన్ పాత్రలోనూ ఎంతో ఇంటెన్సిటీ ఉండబోతోంది” అని అన్నారు.