ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోని సినిమా థియేటర్స్ పరిస్థితి బాలేదు. సంక్రాంతి తర్వాత స్టార్ హీరోలు సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. దాంతో థియేటర్ రెవెన్యూ బాగా పడిపోయింది. డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఒక సినిమా లాభాలు తెచ్చిపెడితే పది సినిమాలు నష్టాలు తెస్తున్నాయి. టాలీవుడ్ లో ఈ ఏడాది సమ్మర్ లో మెరుపులు ఏమి లేవు. తండేల్, హిట్ 3 యావరేజ్ గా నిలవగా, సింగిల్ హిట్ గా నిలిచింది. ఇక ఈ నెలలో వచ్చిన తగ్ లైఫ్ డిజాస్టర్ గా నిలిచింది. భైరవం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ప్లాప్ గా నిలిచింది.
Also Read : Kollywood : సోషల్ మీడియాను షేక్ చేసేందుకు రెడీ అవుతున్న అనిరుధ్
కాగా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల ఆశలన్నీ ఈ నెల 20న రాబోతున్న కుబేర పైనే ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్ లో చేస్తున్న స్ట్రయిట్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మంచి కంటెంట్ తో రాబోతుంది అని తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్స్ లో సినిమాలు లేకపోవడంతో కుబేర కు భారీ ఎత్తున రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. శేఖర్ కమ్ముల క్రేజ్ తో పాటు ఇన్ సైడ్ టాక్ కూడా పాజిటవ్ గా ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య వస్తున్నా ‘కుబేర’ ఆడియెన్స్ ను థియేటర్స్ కు రప్పించి, డిస్టిబ్యూటర్స్ కు అలాగే థియేటర్లకు కనకవర్షం కురిపిస్తుందేమో మరో వారం రోజుల్లో తెలుస్తుంది.