కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది ఒకే ఒకడు అతడే అనిరుధ్. ధనుష్ కోలవెరి 3 సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ కంపోజర్ గా ఎదిగాడు. యంగ్ హీరోల దగ్గరనుండి స్టార్ హీరోస్ వరకు అనిరుధ్ కావాలనే డిమాండ్ ఏర్పడింది. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే చాలు మ్యూజిక్ అదరగొడతాడు అనిరుధ్. ఒకానొక దశలో బక్కోడు ఏం కొడుతున్నాడ్రా వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్స్, ఎలా వస్తాయి రా ఇలాంటి కంపోజింగ్స్. పిచ్చోళ్లు అయిపోవాల్సిందే అనుకునేంతలా సక్సీడ్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్. బీజీఎమ్స్, సాంగ్స్ తో సినిమా భారీ విజయంలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.
Also Read : RAPO 22 : ఆంధ్రా కింగ్ లో రామ్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ సీన్స్..
మాస్టర్, బీస్ట్, విక్రమ్, జైలర్, జవాన్, దేవర చిత్రాల విజయంలో అనిరుధ్ కీలక పాత్ర పోషించాడు. కాగా ఇటీవల అనిరుధ్ హావ కాస్త తగ్గింది. మనోడు కంపోజ్ చేసిన ఇండియన్ 2, వెట్టయాన్, విదాముయార్చి నిరాశపరిచాయి. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు అనిరుధ్. ఇప్పుడు ఆ గ్యాప్ ను కవర్ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నాడు అని. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న జననాయగన్ నుండి గ్లిమ్స్ రాబోతుంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ నుండి చిటికె వైబ్ అనే లిరికల్ సాంగ్ ఈ వారంలో రాబోతుంది. ఈ రెండిటితో పాటు యంగ్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న మదరాసి ఫిస్ట్ సింగిల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇలా వరుస అప్డేట్స్ తో అనిరుధ్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ చేయబోతున్నాడు.