Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. ‘ఆపరేషన్ సింధూర్’పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ఆధారంగా రూపొందిన ప్రత్యేక డాక్యుమెంటరీని డిస్కవరీ అధికారికంగా ప్రకటించింది. ‘డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సింధూర్’ పేరుతో రూపొందిన ఈ రెండు భాగాల డాక్యుమెంటరీ ఆగస్టు 15న రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు డిస్కవరీ ఛానల్ లో ప్రసారం కానుంది. ఈ డాక్యుమెంటరీలో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన వ్యూహాలు, ప్రణాళికలను విపులంగా చూపించనున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నుంచి మే 7న ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ అమలు వరకు జరిగిన కీలక పరిణామాలను ఇందులో ఆవిష్కరించనున్నారు. నిర్మాతలు పంచుకున్న వివరాల ప్రకారం, ఈ సిరీస్‌లో భారత సైనిక నాయకత్వ ప్రతినిధులు, క్షేత్రస్థాయిలో పాల్గొన్న అధికారులు, ప్రముఖ జర్నలిస్టుల అభిప్రాయాలు ఉంటాయి. ముఖ్యంగా 88 గంటల సైనిక ఆపరేషన్ ఎలా ప్రణాళికాబద్ధంగా అమలైందో, దాని వెనుక ఉన్న వ్యూహాత్మక ఆలోచనలు, కీలక నిర్ణయాలను ప్రేక్షకులకు చేరవేయనున్నారు.
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ దక్షిణాసియా ఫ్యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అధికారి సాయి అభిషేక్ మాట్లాడుతూ, ఈ డాక్యుమెంటరీతో తమ కొత్త ‘డీక్లాసిఫైడ్’ ఫ్రాంచైజీకి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. చరిత్రను మలుపుతిప్పిన కీలక సంఘటనలను విశ్వసనీయ సమాచారంతో ప్రేక్షకులకు అందించడం ఈ ఫ్రాంచైజీ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. భారత సాయుధ దళాల మూడు విభాగాలకు చెందిన ప్రతినిధులు, ఆపరేషన్‌కు అత్యంత సమీపంగా పనిచేసిన కమాండోల అనుభవాలను ఇందులో పొందుపరచడం తమకు గౌరవంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని అత్యంత బాధ్యతతో రూపొందించినట్లు వెల్లడించారు. బయటకు తెలిసిన వివరాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఆపరేషన్ సింధూర్ వెనుక ఉన్న సైనిక వ్యూహాలు, ప్రణాళిక, నిర్ణయాలు, మిషన్‌లో పాల్గొన్న సిబ్బంది అనుభవాలను కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
Also Read
- Jr NTR : 'డ్రాగన్' షూటింగ్‌కు బ్రేక్.. ఎన్టీఆర్ గాయం కారణంగా శ్రీలంక షెడ్యూల్ రద్దు
- Fauzi: ప్రభాస్‌కు తల్లిగా అలనాటి అందాల తార.. 'ఫౌజీ'లో ఒకప్పటి స్టార్ హీరోయిన్!
- Preethizinta : ఎనిమిదేళ్ల విరామం తర్వాత బిగ్ స్క్రీన్‌పై ప్రీతి జింటా
- Ramayan: 'రామాయణం'లో రణబీర్ కపూర్ పారితోషికం150 కోట్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని స్టార్ ఎవరో తెలుసా ?
పహల్గామ్ ఉగ్రదాడి అనేది 22 ఏప్రిల్ 2025న జమ్మూ కాశ్మీర్‌లోని బైసరన్ లోయ వద్ద పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) జరిపిన అత్యంత ఘోరమైన కాల్పుల ఘటన. ఈ ఉగ్రదాడిలో 26 మంది హిందూ, క్రిస్టియన్ పర్యాటకులతో పాటు ఒక ముస్లిం గైడ్ దుర్మరణం పాలయ్యారు. ఇది 2008 ముంబై దాడుల తర్వాత పౌరులపై జరిగిన అతిపెద్ద దాడిగా నమోదైంది. దీనికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించి కీలక ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఉగ్రదాడి జరిగి ఏడాది దాటినప్పటికీ పహల్గామ్ పర్యాటక రంగం ఇంకా కోలుకోలేదు. దీనికితోడు నిన్న రాత్రి (31 జూలై 2026) కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని జరిపిన తాజా కాల్పుల్లో ఒకరు మరణించడంతో కాశ్మీర్ లోయలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఆగస్టు 15న చూపించబోయే ఈ డాక్యుమెంటరీతో ప్రజలకు తెలియని మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.
- Tags
- cinema
- Operation Sindoor
తాజావార్తలు
-
Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. ‘ఆపరేషన్ సింధూర్’పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్‌లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
-
August 2026 Smartphone Launches: గూగుల్ పిక్సెల్ 11 నుంచి పోకో ఎం8 పవర్ వరకు.. ఆగస్టులో రానున్న కొత్త ఫోన్లు
-
IMD Monsoon Forecast: రైతన్నలకు చేదు వార్త.. ఆగస్టు, సెప్టెంబర్లలో తగ్గనున్న వర్షాలు..
-
Jr NTR : ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. ఎన్టీఆర్ గాయం కారణంగా శ్రీలంక షెడ్యూల్ రద్దు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!