Venu Yeldandi : తన రెండవ సినిమా పనులు మొదలు పెట్టిన దర్శకుడు వేణు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమిడియన్ గా పలు సినిమాల లో అలరించిన వేణు.. అత్యంత ఆదరణ పొందిన జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకుంటూ మంచి గుర్తింపు ను సంపాదించారు.ఆ తర్వాత తను దర్శకత్వం వహించిన మొదటి సినిమా బలగం సినిమా తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.సైలెంట్ గా వచ్చిన బలగం సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం మనందరికి తెలిసిందే. మొదటి సినిమాతో నే డైరెక్టర్ గా మంచి విజయం సాధించాడు వేణు… అతని రెండో చిత్రం ఎప్పుడు వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నే వేణు అదిరిపోయే అప్డేట్ ను ఇచ్చారని తెలుస్తుంది . తను తీయబోతున్న రెండో సినిమా స్క్రిప్టు పనుల్ని సోమవారం నాడు ప్రారంభించానని సోషల్ మీడియాలో వేదిక గా ఆయన తెలిపారు.. ఇందుకు సంబంధించి పెన్ను మరియు పేపర్ ఫోటోని కూడా ఆయన షేర్ చేశారు.
దీనిపై నెటిజన్లు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కూడా బలగం సినిమా లాగే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొంతమంది నెటిజన్స్ మంచి యాక్షన్ తో కూడిన థ్రిల్లింగ్ కథ రాయమని కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే వేణు ఎలాంటి సినిమా తీయనున్నారు,అందులో హిరో హిరోయిన్ లు ఎవరు అనే విషయాలు మాత్రం తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.. తెలంగాణ సంస్కృతి మరియు సంప్రదాయలు మీద తీసిన బలగం సినిమా పెద్ద హిట్ అయింది.. ఓటీటీ లో కూడా ఈ సినిమా విశేషమైన ఆదరణ పొందింది. తెలంగాణలో ని పలు గ్రామాల్లో ఈ సినిమాని ఊరంతా చూసేలా ప్రదర్శించడం విశేషం.. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది.బలగం సినిమాను మంచి ఎమోషన్ తో తెరకెక్కించాడు దర్శకుడు వేణు. తన రెండవ సినిమా లో కూడా అలాంటి ఎమోషనల్ సీన్స్ ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!