Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా అనేది కేవలం ఒక కళ మాత్రమే కాదు, అది పక్కా లెక్కలతో కూడిన ఒక వ్యాపారం కూడా, నేటితరం దర్శకులు టెక్నాలజీని, భారీ బడ్జెట్లను నమ్ముకుంటున్న వేళ, సీనియర్ దర్శకుడు రవిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. అసలు ‘ఫిల్మ్ మేకింగ్’ అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం అటు మేకర్స్‌కి, ఇటు ప్రేక్షకులకు కొత్త కోణాన్ని పరిచయం చేస్తోంది. ఒక అద్భుతమైన కథను, అనుకున్న బడ్జెట్లో, కేటాయించిన సమయంలో, ఉన్న వనరులతో వెండితెరపై ఆవిష్కరించడమే నిజమైన సినిమా మేకింగ్ అని అన్నారు. రవిబాబు అభిప్రాయం ప్రకారం, “అపరిమితమైన సమయం, అంతులేని బడ్జెట్ ఉంటే ఏ వెదవ అయినా సినిమా తీస్తాడు, కానీ, పరిమితుల మధ్య ఉండి, క్వాలిటీ తగ్గకుండా అవుట్‌పుట్ తీసుకురావడమే దర్శకుడి ప్రతిభకు అసలైన పరీక్ష.
హాలీవుడ్ స్టూడియోల పనితీరును గమనిస్తే, అక్కడ ప్రతి నిమిషానికి ఒక లెక్క ఉంటుంది. స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత, షూటింగ్ షెడ్యూల్ దాటడం అన్నది అక్కడ అరుదుగా జరుగుతుంది. అలాంటి పక్కా ప్రణాళిక ఉన్నప్పుడే నిర్మాతలు నష్టపోకుండా ఉంటారు. కానీ, మన దగ్గర మాత్రం నెలల తరబడి షూటింగ్‌లు సాగదీయడం, బడ్జెట్ అదుపు తప్పడం అన్నది సర్వసాధారణం అయిపోయింది. ఈ ధోరణి మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఒక కథను రూపొందించేటప్పుడు దాని స్కోప్ ముందే ఊహించగలగాలి. అందుబాటులో ఉన్న నిధులతో విజువల్స్ ఎలా గ్రాండ్‌గా చూపాలి? అనుకున్న తేదీకి సినిమాను సిద్ధం చేయడం వల్ల కలిగే మార్కెట్ ప్రయోజనాలు ఏమిటి? ఉన్న టెక్నీషియన్లను, పరికరాలను గరిష్ట స్థాయిలో ఎలా ఉపయోగించుకోవాలి? ఈ మూడు అంశాలను బ్యాలెన్స్ చేయడమే ఒక దర్శకుడి అసలైన విజయం. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమో, అనవసరపు గ్రాండియర్ కోసమో సమయాన్ని వృధా చేయడం వల్ల ప్రాజెక్ట్ విలువ తగ్గుతుంది తప్ప పెరగదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
తాజావార్తలు
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!