‘అక్టోబర్ నెలాఖరు వరకూ ఏ నిర్మాత తమ చిత్రాలను ఓటీటీలకు ఇవ్వకూడదం’టూ ది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్ ఇటీవల తీర్మానం చేసింది. అయితే… దానికంటే ముందే ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తన బ్యానర్ లో ఇతరులతో కలిసి నిర్మిస్తున్న ‘నారప్ప, దృశ్యం -2, విరాట పర్వం’ చిత్రాలను ఓటీటీ రిలీజ్ కు అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ ఛాంబర్ సర్వ సభ్య సమావేశంలోనూ సభ్యులు సురేశ్ బాబును టార్గెట్ చేస్తూ…