Kalyan G Gogana: ‘కళింగరాజు’ రూపకల్పనలో ‘తీస్ మార్ ఖాన్’ డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
”నాటకం, సుందరి, తీస్ మార్ ఖాన్” వంటి విభిన్నమైన కథా చిత్రాలను తెరకెక్కించారు కళ్యాణ్ జీ గోగణ. విభిన్నమైన జానర్లలో సినిమాలు తీస్తూ తెలుగు చిత్రసీమలో తనదైన మార్క్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే మాస్ కమర్షియల్ సినిమా అంటూ ‘తీస్ మార్ ఖాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన దర్వకత్వంలో మరో కొత్త చిత్రం రాబోతోంది. నవయుగ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద రాబోతోన్న ఈ చిత్రానికి ‘కళింగరాజు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రవికుమార్, ఐ. రవి కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నేహా సింగ్ సమర్పకురాలిగా, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ఖుషీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నటుడు ఈ చిత్రంలో హీరోగా నటించబోతోన్నారు. ఈ సినిమాకు శేఖర్ నీలోజి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేయనున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ఎన్నో వందల చిత్రాలకు పని చేసిన చోటా కె. ప్రసాద్ ‘కళింగరాజు’ మూవీకి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ‘తీస్ మార్ ఖాన్’ వంటి కమర్షియల్ సినిమాకు తన ఫోటోగ్రఫీతో మెప్పించిన బాల్ రెడ్డి.. ఈ సినిమాకు కెమెరామెన్‌గా పని చేయనున్నారు. ప్రస్తుత సంగీత దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పర్చుకున్న సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రయూనిట్ ప్రకటించనుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?