దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన దర్శకుడు హను రాఘవపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “తెలుగులో దుల్కర్ ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టారు. తొందరగా సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక సగటు మనిషి మీద సినిమా తీస్తూ, దానిని చాలా పద్ధతిగా చెప్పి, చాలా మంచి సినిమా కింద టర్న్ చేసి, సక్సెస్ ఫుల్ సినిమా చేయడం అనేది కష్టమైన పనే. అది వెంకీ సార్ సినిమాతో స్టార్ట్ చేసి, లక్కీ భాస్కర్ తో ల్యాండ్ అయ్యాడు.
Dil Raju: నన్ను నేను నాగ వంశీలో వెతుక్కుంటున్నాను
వెంకీ సార్ సినిమా నుంచి నచ్చడం మొదలెట్టాడు. ఎందుకంటే తను ముందు చేసిన లవ్ స్టోరీలు లాంటివి చాలామంది చేశారు. కానీ సార్ సినిమాలో ఒక సోషల్ ఇష్యూని తీసుకొచ్చి అంత హృద్యంగా చెప్పడం గ్రేట్. నేను ఆ సినిమా చూసి ఏడ్చాను. అప్పటినుంచి నేను వెంకీకి ఫ్యాన్ అయ్యాను. మా అమ్మగారు, అమ్మమ్మగారు లక్కీ భాస్కర్ సినిమా చూసి.. నువ్వెప్పుడు ఇలాంటి సినిమా తీస్తావురా అని అడిగారు. ప్రేమకథలు కాదు, ఇలాంటి పనికొచ్చే సినిమాలు చేయమని చెప్పారు. 70-80 ఏళ్ళ వయసున్న వారు కూడా సినిమా గురించి ఇలా మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం అని అన్నారు.