మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’ (PEDDI) చిత్రం జూన్ 4న విడుదలకు సిద్ధమవుతున్న వేళ, ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న ఆస్కార్ విజేత, లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) గురించి దర్శకుడు బుచ్చిబాబు సన పంచుకున్న ఒక క్రేజీ ఫన్ సీక్రెట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రముఖ ఛానల్ ‘ఎన్‌టీవీ’ (NTV) కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ఈ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
ఇంటర్వ్యూలో దుబాయ్ మ్యూజిక్ సిట్టింగ్స్ జర్నీని గుర్తు చేసుకుంటూ బుచ్చిబాబు.. ‘దుబాయ్‌లో రెహమాన్ భాయ్ సాధారణంగా బయట తిరిగేటప్పుడు ఫేస్ మాస్క్ వేసుకుంటారు. కానీ ఆయన పొరపాటున ఆ ఫేస్ మాస్క్ తీశారా.. అక్కడ సిట్యుయేషన్ మామూలుగా ఉండదు. షాపుల వాళ్లు, హోటల్స్ వాళ్లు ఆయనను గుర్తుపట్టి.. ‘అల్లా రఖా రెహమాన్’ అంటూ చుట్టుముట్టేస్తారు. ఇక ఆ తర్వాత మనం ఏం కొన్నా, ఎక్కడ తిన్నా బిల్లు వేయరు.. అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారు! అక్కడ ఆయనకున్న రేంజ్, రెస్పెక్ట్ చూసి నాకు మైండ్ బ్లాంక్ అయింది’.. గ్లోబల్ లెవెల్‌లో ఏఆర్ రెహమాన్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి బుచ్చిబాబు పంచుకున్న ఈ చిన్న సంఘటన ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇదే మ్యూజిక్ సిట్టింగ్స్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ కూడా వెలుగులోకి వచ్చింది. బుచ్చిబాబు దుబాయ్‌లో రెహమాన్‌కు కథ వివరిస్తున్నప్పుడే, ఆ ఎమోషనల్ వైబ్‌కు కనెక్ట్ అయిపోయిన రెహమాన్.. కేవలం 3 గంటల వ్యవధిలోనే సినిమాలో వచ్చే ‘చికిరి’ (Chikiri), ‘రాయ్ రాయ్ రారా’ (Rai Rai Rara) అనే రెండు పవర్‌ఫుల్ ట్యూన్స్‌ను కంపోజ్ చేసేశారట.మే 18న ముంబైలో జరగబోయే గ్రాండ్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) విజువల్స్‌ను ఏ రేంజ్‌లో ఎలివేట్ చేయబోతోందో స్పష్టం కానుంది.
దుబాయ్ లో రెహమాన్ భాయ్ ఫేస్ మాస్క్ తీసాడో.. మామూలుగా ఉండదు..అన్ని ఫ్రీ..
FULL Interview – https://t.co/EGbWgOnAnf#ARRahman #BuchibabuSana #RamCharan #Peddi #PeddiOnJune4th #ARRahman #NTVTelugu@arrahman @BuchiBabuSana @AlwaysRamCharan @tarakviews pic.twitter.com/la4oqVU4eI
— NTV Telugu (@NtvTeluguLive) May 16, 2026
